MAA Elections 2021: పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్, బాలయ్య.. ఎవరు గెలుస్తారని చెప్పారంటే..

మా ఎన్నికలు క్లైమాక్స్‏కు చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

MAA Elections 2021: పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్, బాలయ్య.. ఎవరు గెలుస్తారని చెప్పారంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 10, 2021 | 9:55 AM

మా ఎన్నికలు క్లైమాక్స్‏కు చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, సాయి కుమార్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు దాదాపు 150 ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా.. మా ఎన్నికల గురించి సినీ తారలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నటి రాశీ, సాయి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీడియాకు మంచి మెటిరియల్ దొరికింది.. చిరంజీవి..

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం.. చిరంజీవి మీడియాతో మాట్లాడారు… పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటిరియల్‌ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో ఆనంద పడాలి కదా. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చెప్పుకొచ్చారు.

ప్రకాష్ రాజ్, విష్ణు అన్నదమ్ముళ్ల లాంటి వారే.. బాలకృష్ణ.. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్‌ రాజ్‌, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. మా సభ్యులకు ఎలాంటి అవసరాలున్నావారికి సహాయం అందించే బాధ్యత మా ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదని, ఇండస్ట్రీలోని అందరిపై ఆ బాధ్యత ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.

నేను కూడా పోటీ చేయాలనుకున్నా కానీ.. సాయి కుమార్.. ఇక అంతకుముందు సాయి కుమార్ మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నాడని కానీ షూటింగ్‌లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు. ఇక ఎవరు గెలిచినా మా గెలిచినట్లేనని చెప్పిన సాయి కుమార్‌.. తాను లోకల్‌, నాన్‌ లోకల్‌ కాదని నేషనలిస్ట్‌ అని తెలిపాడు.

Also Read: Bandla Ganesh: మా ఎన్నికల్లో బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్.. జీవిత మీద తన కోపాన్ని ఎలా చూపించాడో చూడండి..

MAA Elections 2021: తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు.. ఈ దూషణలెందుకు.. మా ఎన్నికలపై పవన్ షాకింగ్ కామెంట్స్..

MAA Elections 2021:  క్యా సీన్ హై.. ఎన్నికల కేంద్రంలో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్య ఆసక్తికర సన్నివేశం…