Bandla Ganesh: మా ఎన్నికల్లో బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్.. జీవిత మీద తన కోపాన్ని ఎలా చూపించాడో చూడండి..
ఎట్టకేలకు మా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు.
ఎట్టకేలకు మా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, రామ్ చరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఒక వైపు ఓటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు పోలింగ్ కేంద్రం బయట మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ముందు నుంచి మా ఎన్నికల్లో వరుస ట్విస్టులు ఇస్తున్నాడు బండ్ల గణేష్.
ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బరిలోకి దిగిన బండ్ల గణేష్.. జీవితా రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి చేరిపోవడంతో.. ఆమెకు వ్యతిరేకంగా ప్యానల్ నుంచి తప్పుకున్నారు. జీవితాపై పోటీగా జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా బరిలోకి దిగి.. నామినేషన్ వేసిన అనంతరం అనుహ్యాంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈరోజు ఎన్నికలు జరగడానికి కొద్ది గంటల ముందు తన ట్విట్టర్ ఖాతాల వేదికగా.. వరుస ట్విస్ట్స్ ఇస్తున్నారు. నిన్న రాత్రి మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థి రఘుబాబును గెలిపించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరోసారి మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బండ్ల గణేష్. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అంతాబాగానే ఉంది.కానీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా ఫోటోను పూర్తిగా మార్క్ చేసి తన కోపాన్ని చూపించాడు. దీంతో ఎన్నికల వేళ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మరోసారి జీవితాపై తనకున్న కోపాన్ని బయటపెట్టారు బండ్ల గణేష్.
ట్వీట్..
Please vote ? pic.twitter.com/EIogzJTlmy
— BANDLA GANESH. (@ganeshbandla) October 9, 2021