AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత.. ఘంటసాలను సంగీత దర్శకుడిగా..

తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొండి. సీనియర్ నిర్మాత, నటి కృష్ణవేణి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే పలు చిత్రాలను నిర్మించారు.

Tollywood: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత.. ఘంటసాలను సంగీత దర్శకుడిగా..
Krishnaveni
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2025 | 8:27 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. సీనియర్ హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను సినీరంగానికి హీరోగా పిరచయం చేశారు కృష్ణవేణి. ఆమె నిర్మించిన మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. అలాగే దివంగత సంగీత దర్శకుడు ఘంటసాలను సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి. అక్కినేని నాగేశ్వర రావుతో చాలా సినిమాలు తీసిన నిర్మాత. కృష్ణవేణి నటిగా, నిర్మాతగానే కాకుండా నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కృష్ణవేణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1936 డిసెంబర్ 24న జన్మించింది. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె డ్రామా ఆర్టిస్టు. 1936లో అనసూయ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసింది. కృష్ణవేణి తండ్రి వైద్యుడు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆఫర్స్ రావడంతో ఆమె 1939లో చెన్నైకి మకాం మార్చింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించింది. 1939లో మీర్జాపురం జమీందారును వివాహం చేసుకుంది. అప్పట్లో వాళ్లకు శోభనాచల స్టూడియో ఉండేది. ఆ తర్వాత దానిని వీనస్ స్టూడియోగా మార్చారు. 1949లో విడుదలైన మన దేశం సినిమా ద్వారా ఆమె నిర్మాతగా ఎంతో మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది.

సీనియర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, నేపథ్య గాయని పి.లీల తదితరులను ఆమె సినీరంగానికి పరిచయం చేసింది. కృష్ణవేణి మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us