ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సంఘవి ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..

Rajeev 

28 April 2026

instagram

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అందాల తారల్లో సంఘవి కూడా ఒకరు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ లోనూ సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ.

తన పదిహేనేళ్ల సినిమా కెరీర్ లో సుమారు 80 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార.

1993లో కొక్కరొకో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంఘవి. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది. 

ఆ తర్వాత తాజ్ మహల్ ,సమర సింహారె డ్డి, సింధూరం, సీతా రామ రాజు, లాహిరి లాహిరి లాహిరి ఇలా సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

తమిళ్, కన్నడ సినిమాలతో ఆక్కడ ఆడియెన్స్ ను కూడా మెప్పించిందీ అందాల తార. ఆతర్వాత సంఘవికి క్రమంగా హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి.

దీనికి తోడు సంఘవి 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకంది. దీంతో ఈ అమ్మడు క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంఘవి తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. దాంతో సంఘవి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.