Ashu Reddy: వేణుస్వామి, ప్రవీణ వస్తారు.. మాట్లాడుకుందాం రా..! టెక్కీకి అషు రెడ్డి ఆఫర్.. ఇదిగో ఆడియో
మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి వర్సెస్ టెక్కీ ధర్మేంద్ర వివాదంలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. అషురెడ్డి అండ్ ఫ్యామిలీ తనను నిండా ముంచేశారని ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు ఫైలయింది. రేపోమాపో అషురెడ్డి సహా ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు.. ఈ క్రమంలో అషురెడ్డి ధర్మేంద్రకు ఫోన్ చేసి.. సెటిల్మెంట్ ఆఫర్ చేసిన ఆడియో వైరల్ అవుతోంది.

మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్.. బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి వర్సెస్ టెక్కీ ధర్మేంద్ర వివాదంలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. అషురెడ్డి అండ్ ఫ్యామిలీ తనను నిండా ముంచేశారని ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు ఫైలయింది. రేపోమాపో అషురెడ్డి సహా ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. అషు రెడ్డి ఎపిసోడ్‌లో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సెటిల్‌మెంట్ కోసం NRI ధర్మేంద్రకు ప్రతిపాదనలు పంపింది అషు. ఆ ఫోన్‌కాల్ ఆడియో రికార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది.. అసలు, ఆ ఆడియోలో ఏముంది?. ధర్మేంద్ర అలియాస్ వెంకట్‌కి అషు ఇచ్చిన సెటిల్మెంట్ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
అషురెడ్డి ఫోన్‌కాల్ ఆడియో రికార్డు..
ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ NRI ధర్మేంద్రకు అషు ప్రతిపాదన చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సెటిల్మెంట్ ఆఫర్‌ను ధర్మేంద్ర ముందు ఉంచింది అషురెడ్డి.. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం.. తన తరఫున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్క వస్తారని చెప్పుకొచ్చింది. లేదంటే, మనమిద్దరమే కలిసి కూర్చొని సెటిల్ చేసుకుందామంటూ మరో ఆఫర్ ఇచ్చింది అషురెడ్డి. మే వరకు టైమిస్తే కోటిన్నర రూపాయలు ఇచ్చేస్తానన్న అషు.. మిగతా డబ్బును లైఫ్‌లో సెటిలైయ్యాక ఇస్తానంటూ చెప్పింది. అయితే, ఈ వివాదంలోకి తన తల్లిని, అక్కను లాగొద్దంది అషురెడ్డి.. లేదు.. కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానని ధర్మేంద్రను హెచ్చరించింది అషు.. అదే సమయంలో నీ ముఖం మళ్లీ చూడాలనుకోవడంలేదు.. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది అషురెడ్డి..
అషు రెడ్డి ఆడియో..
హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి..
మరోవైపు, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది అషురెడ్డి.. తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసంచేసి 9 కోట్ల 8 లక్షలు తీసుకుందన్న ధర్మేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదైంది. లోన్లు తీసుకొని మరీ అషురెడ్డి కోసం ఖర్చుచేశానన్నాడు ధర్మేంద్ర.. వారం కిందట FIR నమోదుకాగా.. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు వెళ్లింది అషురెడ్డి..
ఫిర్యాదులో ఏముందంటే..
ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి 9.5 కోట్లకు పైగా కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు సత్యనారాయణ. అందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో పాటు అషురెడ్డికి కొనిచ్చిన కారు, విల్లా , గోల్డ్ తాలుకూ ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. మనీ కోసమే అషురెడ్డి పెళ్లి పేరటి తనను మాయ చేసిందని వాపోయారు ధర్మేంద్ర. అడిగినప్పుడల్లా అప్పు చేసి మరీ ఆమెకు డబ్బు ఇచ్చానన్నారు. పెళ్లి మాటెత్తినా,డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా సూసైడ్ చేసుకుంటానని బెదిరించేదన్నారు. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందన్నారాయన.
ఇక అషురెడ్డి తండ్రి వెర్షన్ ఈకేసులో మరో ట్విస్ట్. ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అన్నారు అషురెడ్డి తండ్రి . తన భార్య ప్రోద్బలంతోనే అషురెడ్డి అలా తయారైందన్నారు. కూతురు చేసిన తప్పుకు తండ్రిగా తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
