Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణంరాజు ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోను పరిచయం చేయాలనుకున్నారా..!

మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు. అలాగే విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా వెయ్యికోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి, కల్కి రెండు సినిమాలు వెయ్యి కోట్లు క్రాస్ చేశాయి.

కృష్ణంరాజు ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరోను పరిచయం చేయాలనుకున్నారా..!
Krishnam Raju , Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2024 | 10:56 AM

రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతూ వస్తుంది. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు. అలాగే విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకొని గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా వెయ్యికోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి, కల్కి రెండు సినిమాలు వెయ్యి కోట్లు క్రాస్ చేశాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ను కృష్ణం రాజు ఈశ్వర్ సినిమాతో పరిచయం చేసిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను అలరించాడు ప్రభాస్. 2002లో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చరా సామి..! బోల్డ్ సీన్స్‌తో బుర్రపాడవ్వాల్సిందే.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

అయితే ప్రభాస్ కంటే ముందు మరో స్టార్ హీరోను కృష్ణం రాజు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారట. ఈ విషయాన్ని కృష్ణం రాజే స్వయంగా చెప్పారు. అవును ప్రభాస్ కాకుండా మరోహీరోను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు కృష్ణం రాజు.. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును మహేష్ బాబును కృష్ణం రాజు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారట. ఇదే విషయం కృష్ణ కు కూడా చెప్పారట. అంతా ఓకే అనుకున్న తర్వాత ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఇది కూడా చదవండి :Anasuya Bharadwaj: మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..

సూపర్ స్టార్ కృష్ణకు, కృష్ణం రాజుకు మధ్య మంచి అనుబంధం.. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. కృష్ణ, కృష్ణం రాజు కలిసి కొన్ని సినిమాల్లోనూ నటించారు. కృష్ణ చిన్న కూతురిని కృష్ణం రాజు దత్తత తీసుకుంటాను అని అనేవారట.. అంత మంది అనుబంధం ఉండేది ఆ ఇద్దరి మధ్య. అయితే మహేష్ ను తాను ఇండస్ట్రీ పరిచయం చేయాలనుకున్నాను అని కృష్ణం రాజు గతంలో అన్నారు. కృష్ణ నటించిన శ్రీ శ్రీ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కృష్ణం రాజు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. మహేష్‌ను నా బ్యానర్ లో పరిచయం చేయాలనుకున్నాను అని అన్నారు. మహేష్ బాబు 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..