Krithi Shetty : ఆ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను.. కృతిశెట్టి ఆసక్తికర కామెంట్స్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వర్సటైల్ యాక్టర్ సుధీర్ బాబు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Krithi Shetty : ఆ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను.. కృతిశెట్టి ఆసక్తికర కామెంట్స్
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 7:01 PM

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వర్సటైల్ యాక్టర్ సుధీర్ బాబు(Sudheer Babu). రీసెంట్ గా ఈ యంగ్ హీరో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ గురించి హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. సుధీర్ బాబు గారు లాంటి మంచి యాక్టర్ తో నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి” అని చెప్పుకొచ్చింది.

అలాగే హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా వుంది అన్నారు. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తండ్రి కూతుళ్ళు కలసి సినిమాకి వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పరిణితి వస్తుంది. ఈ సినిమాకి మరిన్ని ప్రశంసలు వస్తాయని బలంగా నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమాకు మీడియా మరింత సపోర్ట్ చేయాలి. ఇంద్రగంటి గారితో పని చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంది. ఈ సినిమా చూసిన తర్వాత కృతిశెట్టి నా ఫేవరేట్ స్టార్ అయ్యారు. మా నిర్మాతలు గర్వంగ చెప్పుకునే సినిమా నిర్మించారు. వారికి ఆల్ ది బెస్ట్. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలి. పీజీ విందా, సాహి సురేష్, మార్తాండ్ కే వెంకటేష్, వివేక్ సాగర్ తో పని చేయడం ఆనందంగా వుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అందరూ తప్పక చూడాల్సిన వర్త్ వాచింగ్ మూవీ” అన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!