Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టడానికి డబ్బులు పరిస్థితి.. ఇప్పుడు వందలకోట్లకు మహారాణి

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. నటీనటులుగా తమకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఈ మెరిసే విశ్వంలోకి అడుగుపెట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు అందం, అభినయం అంతకుమించిన ప్రతిభతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. టాప్ హీరోహీరోయిన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలిగి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టడానికి డబ్బులు పరిస్థితి.. ఇప్పుడు వందలకోట్లకు మహారాణి
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2025 | 11:41 AM

చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా వందలకోట్లు వెనకేసుకుంటున్నారు. సినిమాలకు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్ లు కూడా చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్స్ కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా వందల కోట్లకు యువరాణిగా ఎదిగింది. గతంలో చేతిలో రూ.10లు కూడా లేని ఆ భామ ఇప్పుడు వందల కోట్లకు యజమాని ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :స్టార్ హీరోయిన్ బాత్రూమ్ వీడియో లీక్.. అసలు విషయం తెలిసి అభిమానులు షాక్

చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుకున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా నానా కష్టాలు పడిన తర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకొని రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే ఆమె కనీసం స్కూల్ ఫీజ్ కూడా కట్టుకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. నిజానికి కరీనా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉంచి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :బాలయ్య విలన్ కూతుర్ని చూశారా..! అందాలతో దుమ్మురేపిన దునియా విజయ్ పుత్రిక

కరీనా కపూర్ తండ్రి రణధీర్. ఆయన బాలీవుడ్ లో నటుడిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆయన ఇద్దరు కూతుర్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పించారు. కరిష్మా ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ కరీనా ఇప్పుడు కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే ఒకానొక సమయంలో కనీసం స్కూల్ ఫీజ్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నాం అని ఆమె తండ్రి రణధీర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే కరీనా కూడా దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కరీనా మాట్లాడుతూ.. “ఒకప్పుడు మేము పేదవాళ్లం. డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం.. అప్పుడు మా చెల్లి కరిష్మా లోకల్ ట్రైన్, బస్సుల్లో కాలేజీకి వెళ్లేది అని కరీనా తెలిపింది. ఇప్పుడు కరీనా వందల కోట్లకు యువరాణి. కరీనా సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ముంబైలో రూ.800కోట్ల బంగ్లాలో నివసిస్తుంది. అలాగే కరీనా ఒకొక్క సినిమాకు రూ. 10కోట్ల నుంచి రూ.12కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.