Cinema: 7 కోట్లతో తీస్తే 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్ చేసింది.. 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇదే..
2025లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టు అయ్యాయి. అలాగే మరికొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ ఓ చిన్న సినిమా మాత్రం థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ. 90 కోట్లు రాబట్టింది. దాదాపు 1200 శాతం లాభాన్ని రాబట్టింది.

2025 సంవత్సరం బాక్సాఫీస్ వద్ద అంత ప్రత్యేకమైనది మాత్రం కాదు. ఎందుకంటే ఈ ఏడాది చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటివరకు 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఛవా అని వినే ఉంటారు. కానీ మీకు ఈ సినిమా గురించి తెలుసా.. ? ఛావా రికార్డును ఒక చిన్న బడ్జెట్ చిత్రం బద్దలు కొట్టింది. కేవలం 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా లాభం 1200 శాతం ఎక్కువ. ఈ సినిమా మరెదో కాదు.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బడ్జెట్ కేవలం రూ. 7 కోట్లు. అభిషాన్ జీవిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసి లాభాల పరంగా నంబర్ 1 చిత్రంగా నిలిచింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మిథున్ జై శంకర్, కమలేష్ జగన్, ఎం శశికుమార్ వంటి అనేక మంది తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 29 ఏప్రిల్ 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి వారంలో రూ. 23 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత పాజిటివ్ మౌత్ టాక్ ఉండడంతో అద్భుతమైన వ్యాపారం చేసింది. భారతదేశంలో రూ. 62 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
అతి తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఛావా సినిమా 808 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దీని బడ్జెట్ 90 కోట్ల రూపాయలు అయితే. దాని లాభం 800 శాతం కాగా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ లాభం 1200 శాతం, దీని ప్రకారం ఇది అత్యంత లాభాలు రాబట్టిన చిత్రం. ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇదే.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..








