Tollywood : 2 సినిమాలు చేస్తే రెండు డిజాస్టర్స్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు నెట్టింట అటామ్ బాంబ్..
తెలుగులో ఆమె చేసింది రెండు సినిమాలే. అయినా గ్లామర్ క్వీన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆమెకు అంతగా ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

రాజకీయ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తొలి చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయింది. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా సరైన హిట్టు కొట్టలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ఇటీవల తన తండ్రితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే నేహా శర్మ. ఆమె తండ్రి అజిత్ శర్మ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులైన అభ్యర్థులలో అజిత్ శర్మ కూడా ఒకరు. 2007లో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలో పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అలాగే పంజాబీ చిత్రాల్లోనూ నటించింది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
2007లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ మొదటి సినిమాతోనే గ్లామర్ క్వీన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నటించింది. ఈ మూవీ సైతం ప్లాప్ కావడంంతో తెలుగులో నేహాకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన నేహా..అక్కడే వరుస సినిమాలలో నటించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
2017లో దుల్కర్ సల్మాన్ నటించిన సోలో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సోలో సినిమా తమిళంలో కూడా విడుదలైంది. నేహాకు మంచి పరిచయాన్ని ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 20 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేహా తండ్రి కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..




