Actress: 28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సెన్సేషన్.. అప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ.. ఇప్పుడు ఇలా..
ఒకప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. అప్పట్లో గ్లామర్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె కీలకపాత్రలో నటించిన ఓ సినిమా టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

సాధారణంగా సినీరంగంలో హీరోల కంటే హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. కొన్నాళ్లపాటు వరుస సినిమాలతో దూసుకుపోయిన తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఇక మరికొందరు పెళ్లి తర్వాత మెయిన్ రోల్స్ కాకుండా సహయ పాత్రలు పోషిస్తుంటారు. ఇంకొందరు తారలు పెళ్లి కాగానే సినిమాలకు దూరమైపోతుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదివరకు జెనీలియా, లయ, అన్షు, శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు మరో టాలీవుడ్ సెన్సేషన్ తెలుగులోకి తిరిగి వస్తుంది. 80-90లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె.. ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల తర్వాత పరిశ్రమలోకి తిరిగి వస్తోంది. ఆమె మరెవరో కాదండి. డిస్కో శాంతి.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
80, 90లలో ఎక్కువగా మారుమోగిన పేరు డిస్కో శాంతి శ్రీహరి. ఆమె 28 సంవత్సరాలుగా ఏ సినిమాలో నటించలేదు. కానీ ఇప్పుడు డైరెక్టర్ ఇనాసి పాండియన్ దర్శకత్వం వహిస్తోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం బుల్లెట్టు బండి చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో నటుడు రాఘవ లారెన్స్, అతడి సోదరుడు ఆల్విన్ ప్రధాన పాత్రలలో నటించారు. శాంతి శ్రీహరి చివరిసారిగా 1997 సంవత్సరంలో సినిమాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇప్పుడు బుల్లెట్టు బండి సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. డెమోంటే కాలనీ, డైరీ వంటి చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అరవింద్ సింగ్ పనిచేశారు.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..








