Actress : మాజీ హోంమంత్రి కూతురు.. ఫస్ట్ సినిమా అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తుంది..
ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె కెరీర్ మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఆమె చేసిన సినిమాలు డిజాస్టర్స్ అయినప్పటికీ.. ఏమాత్రం సడలని ధైర్యంతో ముందుకు సాగింది. ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, యాక్టింగ్ పరంగా సినీప్రియులను కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మాజీ హోంమంత్రి కూతురు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె నటించిన ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. భూమి పెడ్నేకర్. 2015లో ‘దమ్ లగా కే హైషా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సమయంలో ఆమె నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. జూలై 18, 1989న ముంబైలో జన్మించిన భూమి ముంబైలోని జుహులోని ఆర్య విద్యా మందిర్ పాఠశాలలో చదువుకుంది.
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న భూమి.. నటి కావాలని కలలు కన్నది. ఇందుకోసం విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ లభించింది. భూమి తండ్రి సతీష్ మోతీరామ్ పెడ్నేకర్, మహారాష్ట్ర మాజీ హోం, కార్మిక మంత్రి. 1980లో కాంగ్రెస్ నుంచి పరేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన మహారాష్ట్ర హోం, కార్మిక మంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి సతీష్ పెడ్నేకర్ కొంకణి. ఆమె తల్లి సుమిత్ర పెడ్నేకర్ హర్యానాకు చెందినవారు. తన భర్త నోటి క్యాన్సర్‌తో మరణించిన తర్వాత సుమిత్ర పొగాకు వ్యతిరేక కార్యకర్తగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
భూమి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి క్యాన్సర్ తో మరణించారు. ఆ తర్వాత భూమి చదువు మానేసి యష్ రాజ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆమె 2015లో ఆయుష్మాన్ ఖురానా సరసన ‘దమ్ లగా కే హైషా’ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. భూమి దాదాపు 6 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. ‘దమ్ లగా కే హైషా’ సినిమా కోసం భూమి 20 కిలోలకు పైగా బరువు పెరిగింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత, నటి మరోసారి తనను తాను స్లిమ్ గా , ఫిట్ గా మార్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో రాణిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..








