Venu Thottempudi: హీరో వేణు తొట్టెంపూడి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

హీరో వేణు తొట్టెం పూడి.. తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

Venu Thottempudi: హీరో వేణు తొట్టెంపూడి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Venu
Follow us

|

Updated on: Jul 28, 2022 | 7:07 PM

హీరో వేణు తొట్టెం పూడి(Venu Thottempudi).. తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో వేణు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు. ఇక ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు వేణు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వేణు. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు భార్య పిల్లల గురించి తెలుసుకోవడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే తన భార్య పిల్లల గురించి పరిచయం చేయకపోవటానికి పెద్దగా రీజన్స్ ఏమి లేవని అన్నారు వేణు. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. వేణు అనుపమ ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారట. వీరి వివాహం జరిగి 10 ఏళ్ళు పైనే అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. బిజినెస్ లో బిజీగా ఉండటం తోనే వేణు సినిమాలకు దూరమయ్యారట. తన భార్య సపోర్ట్ తోనే అటు ఫ్యామిలీని , ఇటు బిజినెస్ ను బ్యాలెన్స్ చేస్తున్నాని చెప్పుకొచ్చారు వేణు.

ఇవి కూడా చదవండి
Venu Thottempudi

Venu Thottempudi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Latest Articles