Disha Patani: యంగ్ హీరోతో దిశా పటానీ బ్రేకప్.. లవ్ స్టోరీపై స్పందించిన హీరో తండ్రి..

నా కొడుకు ప్రేమ గురించి మాట్లాడడం.. అతని వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. వారిద్దరి గోప్యతను నేను భంగం కలిగించాలనుకోవడం లేదు.

Disha Patani: యంగ్ హీరోతో దిశా పటానీ బ్రేకప్.. లవ్ స్టోరీపై స్పందించిన హీరో తండ్రి..
Disha Patani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 1:53 PM

బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్.. హీరోయిన్ దిశా పటానీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దిశా పటానీ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందని టాక్ నడుస్తోంది. ఆరేళ్లపాటు హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అతనితో బ్రేకప్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి లవ్ అండ్ బ్రేకప్ స్టోరీపై హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాకీ ష్రాఫ్ తన కొడుకు, దిశా ఇద్దరు మంచి స్నేహితులని తెలిపారు.

జాకీ మాట్లాడుతూ.. “నా కొడుకు ప్రేమ గురించి మాట్లాడడం.. అతని వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. వారిద్దరి గోప్యతను నేను భంగం కలిగించాలనుకోవడం లేదు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ ఇద్దరు మంచి స్నేహితులని తెలుసు.. వారిద్దరు కలిసి బయటకు వెళ్లడం నాకు తెలుసు. వారు ఇప్పటికీ మంచి స్నేహితులని అనుకుంటున్నాను. నా భార్య అయోషా ష్రాఫ్, కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా దిశాతో మంచి అనుబంధం ఉంది. టైగర్ ష్రాఫ్, దిశా తమ ప్రేమను, వారిద్దరు కలిసి ఉండాలా ? వద్దా ? అనేది వారే నిర్ణయించుకోవాలి. అది వారి ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు.