Allu Arjun: హరిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే..

ఈ క్రమంలో తన ఖాళీ సమయాన్నిఅటు ఫ్యామిలీతో వెకెషన్స్ అంటూ.. ఇటూ యాడ్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు బన్నీ. ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో

Allu Arjun: హరిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే..
Allu Arjun 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 2:10 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పకు సిక్వెల్‏గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఆగస్ట్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తన ఖాళీ సమయాన్నిఅటు ఫ్యామిలీతో వెకెషన్స్ అంటూ.. ఇటూ యాడ్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు బన్నీ. ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ చేసిన అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ హరిష్ శంకర్ తో జత కట్టారు.

తాజాగా డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఓ కంపెనీకి సంబంధించిన యాడ్ ఫిల్మ్ చేయబోతున్నారు బన్నీ. వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు చూస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు బన్నీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Bunny

Bunny

అందులో డైరెక్టర్ హరిష్ శంకర్‏తో కలిసి ముచ్చటిస్తున్నారు. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలలో బన్నీ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Bunny 1

Bunny 1మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.