Kiccha Sudeep: ‘ప్రభాస్‏తో సినిమా చేయడానికి నేను రెడీ.. కానీ ఆ కండిషన్’.. కిచ్చా సుదీప్ కామెంట్స్..

ప్రభాస్ చాలా మంచి మనస్సు కలవాడు. నేను అతడిని ఒకసారి కలిశాను. మేము ఇద్దరం కలిసి సినిమా చేసేందుకు నేను సిద్ధమే.

Kiccha Sudeep: 'ప్రభాస్‏తో సినిమా చేయడానికి నేను రెడీ.. కానీ ఆ కండిషన్'.. కిచ్చా సుదీప్ కామెంట్స్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 1:34 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో పనిచేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“ప్రభాస్ చాలా మంచి మనస్సు కలవాడు. నేను అతడిని ఒకసారి కలిశాను. మేము ఇద్దరం కలిసి సినిమా చేసేందుకు నేను సిద్ధమే. నాకు ఇష్టమే. కానీ విలన్ గా మాత్రమే నేను నటించను. నేనెప్పుడూ కథానాయికుడిగానే నటించాను. కేవలం దబాంగ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాను. నాకు విలన్ పాత్రలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడూ విలన్ పాత్రలలో నటించడం మాత్రం ఇష్టం లేదు. సల్మాన్ సర్ సినిమాలో విలన్ గా నటించడంలో నేను చాలా సంతోషించాను. కానీ నేనెప్పటికీ అలా ఉండాలనుకోవడం లేదు. ప్రభాస్ కు నాకు మంచి పాత్రలు ఉంటే మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చారు” సుదీప్.