Sunil Shetty: కోట్లకు అధిపతి అయినా సింపుల్ లైఫ్.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఆస్తులు తెలిస్తే షాకే..
సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సునీల్ శెట్టి ఈరోజు కూడా జిమ్‌నే తన రెండో ఇల్లుగా చేసుకున్నాడు. దశాబ్దాలుగా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్న సునీల్ శెట్టి ఒకప్పుడు షారుక్ ఖాన్ , సల్మాన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నాడు. ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్న సునీల్ శెట్టి అటు బ్రాండ్స్ ప్రకటనలలో కనిపిస్తున్నాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సునీల్ శెట్టి ఒకరు. బాద్ షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న సమయంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు సునీల్ శెట్టి. 1962 ఆగస్టు 11న మంగళూరులోని ముల్కిలో జన్మించిన సునీల్ శెట్టి ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు సునీల్ శెట్టికి 62 ఏళ్లు వచ్చినా ఇప్పుడు కూడా అతడికి డిమాండ్ తగ్గలేదు. సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సునీల్ శెట్టి ఈరోజు కూడా జిమ్‌నే తన రెండో ఇల్లుగా చేసుకున్నాడు. దశాబ్దాలుగా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్న సునీల్ శెట్టి ఒకప్పుడు షారుక్ ఖాన్ , సల్మాన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నాడు. ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్న సునీల్ శెట్టి అటు బ్రాండ్స్ ప్రకటనలలో కనిపిస్తున్నాడు.
సునీల్ శెట్టి 90వ దశకంలో బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడు. అప్పట్లో సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి నటులకు డిమాండ్ ఉండేది. ఆ సమయంలో షారుఖ్, సల్మాన్ కంటే శెట్టి, అక్షయ్, అజయ్‌లకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ముందు నుంచి వ్యాపారరంగంలో చాలా చురుకుగా, తెలివిగా ఉన్నాడు. అనవసర ఖర్చులు చేయడం తనకు ఇష్టముండదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టికి ఇష్టమైన పెట్టుబడి రంగం రియల్ ఎస్టేట్. దీంతో సునీల్ శెట్టికి కూడా భారీ లాభాలే వచ్చాయి. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత క్రికెటర్ కెఎల్ రాహుల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. సునీల్ శెట్టికి ముంబై శివార్లలో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఫామ్ హౌస్ ఉంది. సునీల్ శెట్టి ముంబైలోని కొన్ని అపార్ట్‌మెంట్లలో కూడా పెట్టుబడి పెట్టాడు. ఇటీవల, శెట్టి కొన్ని ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశాడు. కర్ణాటకలో రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
సునీల్ శెట్టి పాపా కార్న్ మీడియా అనే నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని సినిమాలను నిర్మించాడు. అదే ప్రొడక్షన్ హౌస్‌తో సునీల్ శెట్టి తన కొడుకు సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ఇప్పుడు శెట్టి ఫిట్‌నెస్‌కు సంబంధించిన కొన్ని స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని కొన్ని చోట్ల శెట్టికి జిమ్ కూడా ఉంది. ఈ హీరో వద్ద మెర్సిడెస్ బెంజ్ GLS, BMW X5, హమ్మర్ H2, రేంజ్ రోవర్ వోగ్, జీప్ రాంగ్లర్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








