AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు రైలులో పాటలు పాడిన కుర్రాడు.. ఇప్పుడు కోట్ల సంపదకు యజమాని.. ఆ హీరో ఎవరంటే..

సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ బలమైన స్థానాన్ని సంపాదించుకోవడం అంత చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని కుర్రాళ్లు ఇండస్ట్రీలో హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఎన్నో సవాళ్లు, విమర్శలు, అవమానాలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని నిలబడాలి. కానీ కొందరు యువకులు తమ ప్రతిభ, కృషితో సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Tollywood: ఒకప్పుడు రైలులో పాటలు పాడిన కుర్రాడు.. ఇప్పుడు కోట్ల సంపదకు యజమాని.. ఆ హీరో ఎవరంటే..
Actor
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2024 | 8:58 PM

Share

సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ బలమైన స్థానాన్ని సంపాదించుకోవడం అంత చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని కుర్రాళ్లు ఇండస్ట్రీలో హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఎన్నో సవాళ్లు, విమర్శలు, అవమానాలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని నిలబడాలి. కానీ కొందరు యువకులు తమ ప్రతిభ, కృషితో సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెరిసే రంగుల ప్రపంచంలో అలాంటి యంగ్ హీరోలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో సింగర్ కమ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. నార్త్ అడియన్స్ కు ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు ఆరాధించే అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు ‘విక్కీ డోనర్’, ‘బధాయి హో’, ‘దమ్ లగాకే హైషా’ వంటి పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయుష్మాన్ సినిమాల్లో నటించే ముందు రైళ్లలో పాడేవాడు.

ఆయుష్మాన్‌కి చిన్నప్పటి నుంచి నటన, పాటలపై ఆసక్తి ఉండేది. అలా ఆయుష్మాన్ కాలేజీలో అడ్మిషన్ రాగానే ఎన్నో పాటల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. కాలేజీ సమయంలో నటుడు ఢిల్లీ నుండి ముంబైకి ఎక్స్‌ప్రెస్ రైలులో తన స్నేహితులతో కలిసి పాడేవాడు. ఈ విషయాన్ని నటుడు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘మా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉండేది. కానీ మేము చాలా సంతోషంగా ఉండేవాళ్లము. మేము రైలులో ప్రయాణిస్తున్న సమయంలో స్నేహితులందరం కలిసి పాటలు పాడేవాళ్లము. కానీ అప్పుడు ఆ రైలులో ఉన్నవారు మాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఒకప్పుడు ప్రజలు నా పాటను ఎంతగానో ఇష్టపడ్డారు, వారు మాకు చాలా డబ్బు చెల్లించారు. ఆ డబ్బుతో గోవా వెళ్లాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాలేజీ రోజుల తర్వాత ఆయుష్మాన్ జీవితంలో అసలు ప్రయాణం మొదలైంది. ఆయుష్మాన్ కెరీర్ కోసం ముంబైకి వచ్చారు. అప్పుడే అతడి జీవిత పోరాటం మొదలైంది. ఎన్నో విమర్శలు, తిరస్కరణల తర్వాత MTVలో ‘రోడీస్’ షోలో పని చేసే అవకాశాన్ని పొందాడు. ఆ షోలో ట్రోఫీని అందుకున్న తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. MTV కోసం వీడియో జాకీగా పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ‘విక్కీ డోనర్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయుష్మాన్ కోట్లాది సంపదను సంపాదించాడు. నివేదికల ప్రకారం, నటుడి నికర విలువ రూ. 80 కోట్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.