Alia Bhatt : అయ్యా బాబోయ్.. అలియా సంపాదన తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. ఎంత ఆస్తులు ఉన్నాయంటే..
డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది అలియా. ప్రస్తుతం జిగ్రా అనే సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. వేదంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం బాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈ బ్యూటీకి ఇటు దక్షిణాదిలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది అలియా. ప్రస్తుతం జిగ్రా అనే సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. వేదంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం బాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా జిగ్రా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది అలియా. ఇటీవలే హైదరాబాద్ వేదికగా నిర్వహించిన జిగ్రా ఈవెంట్లో సందడి చేసింది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రా మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో అలియా మరో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించిందని భావిస్తున్నారు. గతంలో గంగూబాయి కతియావాడి సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది అలియా. అలాగే ఇప్పటివరకు ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు మరిన్ని పురస్కారాలు సొంతం చేసుకుంది.
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే తారలలో అలియా ఒకరు. ఒక్కో సినిమాకు రూ. 15-18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్‌లో ఆమె హాలీవుడ్ అరంగేట్రం కోసం ఆమె $500,000 పారితోషికం తీసుకుంది. ప్రస్తుతం అలియా ఆస్తుల విలువ రూ.550 కోట్లు ఉంటుంది. నటన, ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌ల ద్వారా సంపాదిస్తుంది. అలియా నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. చిన్న పిల్లల దుస్తులు బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మను 2020లో ప్రారంభించింది. దీని విలువ ఇప్పుడు రూ. 150 కోట్లు. అలాగే సొంతంగా ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కూడా కలిగి ఉంది. ది నెట్‌ఫ్లిక్స్‌కు దాదాపు రూ. రూ. 80 కోట్లు. ఆమె లండన్ , ముంబైలో ఆస్తులను కలిగి ఉంది. బాంద్రాలో ఆమె బంగ్లా ఖరీదు రూ.32 కోట్లు. ముంబై అపార్ట్‌మెంట్ ధర రూ. 35 కోట్లు. ఆమె BMW , రేంజ్ రోవర్‌తో సహా హై-ఎండ్ కార్లను కూడా కలిగిఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.