World of Euphoria: డైరెక్టర్ గుణశేఖర్‌ కొత్త సినిమా ‘యుఫోరియా’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

ఇప్పుడు ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు.

World of Euphoria: డైరెక్టర్ గుణశేఖర్‌ కొత్త సినిమా ‘యుఫోరియా’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్..
World Of Euphoria
Follow us

|

Updated on: Oct 09, 2024 | 8:07 PM

సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ‘యుఫోరియా’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు.

సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గుణ శేఖర్ గారి మొదటి చిత్రం లాఠీ. ఆ మూవీ ఇప్పటికీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సక్సెస్‌లు చూశారు. అలాగే ఫెయిల్యూర్స్ కూడా చూశారు. కానీ ఆ ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, అది ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ప్రస్తుత యువతకు కనెక్ట్ అయ్యే సినిమా. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘యుఫోరియా సినిమా అంతా కొత్త వారితో చేశాను. ఇందులో తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను ఆధారంగా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. ఏడాదిన్నర క్రితం ప్రాజెక్ట్ అనుకున్నాం. అందుకు ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం. వీళ్లందరినీ ఆడిషన్స్ చేసి.. వర్క్ షాపులు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఇలాంటి భయంకరమైన సమస్యలు పరార్..!
ఈ గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఇలాంటి భయంకరమైన సమస్యలు పరార్..!
Pro Kabaddi: 5 ఏళ్ల కరువుకు చెక్ పెట్టేసిన బెంగాల్ వారియర్స్..
Pro Kabaddi: 5 ఏళ్ల కరువుకు చెక్ పెట్టేసిన బెంగాల్ వారియర్స్..
17 ఏళ్లకే ఎన్నో విమర్శలు.. కట్ చేస్తే.. వందల కోట్లకు మహారాణి..
17 ఏళ్లకే ఎన్నో విమర్శలు.. కట్ చేస్తే.. వందల కోట్లకు మహారాణి..
బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..?ఇలా జుట్టుకు వాడి చూడండి
బియ్యం కడిగిన నీళ్లు పారబోసేస్తున్నారా..?ఇలా జుట్టుకు వాడి చూడండి
త్యం అలసటగా ఉంటున్నారా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
త్యం అలసటగా ఉంటున్నారా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
యూపీ సీఎం యోగిని చంపేస్తామని యువతి ఫోన్ కాల్!
యూపీ సీఎం యోగిని చంపేస్తామని యువతి ఫోన్ కాల్!
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా?
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఏడాది ఏదో తెలుసా?
సరదా చావుకొచ్చింది..! ఫన్‌రైడ్‌ కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
సరదా చావుకొచ్చింది..! ఫన్‌రైడ్‌ కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
ఒకప్పుడు నటుడిగా ఆ సినిమాలకు ఆడిషన్స్.. ఇప్పుడు..
ఒకప్పుడు నటుడిగా ఆ సినిమాలకు ఆడిషన్స్.. ఇప్పుడు..
చెత్త జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. కెరీర్‌లోనే అతి పెద్ద కళంకం
చెత్త జాబితాలో చేరిన రోహిత్ శర్మ.. కెరీర్‌లోనే అతి పెద్ద కళంకం
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా.?
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
శ్రద్దా పోయి శ్రీలీల వచ్చింది.! |గోపీచంద్‌ చొక్కానే ప్రభాస్‌..
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.
గ్యాంబ్లర్ వచ్చేశాడు.. అదరగొట్టేస్తున్నాడు.! నేచర్ బాలన్స్ వరుణ్.
స్టార్ హీరో రేసింగ్‌ వెబ్‌ సైట్‌ అసలు విషయం.తెలిసి ఫీలైన ఫ్యాన్స్
స్టార్ హీరో రేసింగ్‌ వెబ్‌ సైట్‌ అసలు విషయం.తెలిసి ఫీలైన ఫ్యాన్స్