Tollywood: చిరు, పవన్‌లతో సినిమాలు.. క్రికెటర్లతో లవ్ ఎఫైర్లు.. పత్తా లేకుండా పోయిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. నందమూరి బాలకృష్ణతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. అదే సమయంలో స్టార్ క్రికెటర్లతో లవ్, డేటింగ్ రూమర్లతో తరచూ వార్తల్లో నిలిచింది.

బెంగళూరుకు చెందిన ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి ఫేమస్ బ్రాండ్స్ ప్రకటనల్లో నటించింది. ఇదే క్రమంలో సినిమాల్లోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైందీ అందాల తార. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ. అలాగే చిరంజీవి, పవన్ కల్యాణ్, రవితేజల సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో సందడి చేసింది. అన్ని భాషల్లో కలిపి సుమారు 50కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. దీనికి తోడు ఈ గ్లామరస్ బ్యూటీ డేటింగులు, లవ్ ఎఫైర్లతో తరచూ వార్తల్లో నిలిచింది. టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శ్రీశాంత్ లతో ఈ హీరోయిన్ ప్రేమ వ్యవహారం నడిపినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ అసలు పేరు లక్ష్మీ రాయ్. ఆ మధ్యన తన పేరును ఇలా మార్చుకుంది. కానీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. 2021లో చివరిసారిగా సిండ్రెల్లా అనే సినిమాలో నటించిందీ అందాల తార. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగులతో సందడి చేసింది. అలాగే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కొన్ని టీవీ షోల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక మలయాళం సినిమా మాత్రమేఉంది.
View this post on Instagram
సినిమాల్లేకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది రాయ్ లక్ష్మీ. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
వెకేషన్ లో రాయ్ లక్ష్మీ..
View this post on Instagram
మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరిస్తూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




