ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.!!

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.. ఇక అంత ఒక్కచోటే.. సెలబ్రెటీ కావాలని చాలా మంది కలలు కంటారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.!!
Film
Follow us

|

Updated on: Feb 09, 2022 | 3:14 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.. ఇక అంత ఒక్కచోటే.. సెలబ్రెటీ కావాలని చాలా మంది కలలు కంటారు. సినిమాల్లో… టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు. కేవలం నటీనటులుగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. రచయితగా.. దర్శకుడిగా.. గాయనీగాయకులుగా.. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి.. ఎలా కలవాలి..సినిమా.. టీవీలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనేది చాలా మందికి తెలియదు. మరోవైపు.. నూతన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, స్టార్ డైరెక్టర్స్‏ది కూడా ఇదే పరిస్థితి. తమ సినిమాల్లో హీరోహీరోయిన్స్ ఉన్నా కానీ.. ప్రతి చిన్న పాత్ర కోసం సరైన నటీనటులను ఎంచుకోవడం.. వారిని ఎలా సంప్రదించాలని అనే విషయాలు తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఈ సమస్సలన్నింటికీ సరైన పరిష్కారం లభించింది. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కచోటికి చేరిపోయింది. అవకాశాల కోసం వెతకడం.. నటీనటులను ఎంచుకోవడానికి ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. అదే “హైస్టార్” (Hystar App) యాప్.

మన ఇండియాలోని అన్ని భాషల ఇండస్ట్రీలకు చెందిన మూవీ మేకర్స్… 24 క్రాప్టులకు సంబంధించిన వ్యక్తులను ఒకచోట కలిపేందుకు హైస్టార్ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్‏లో అందుబాటులో ఉందని సమాచారం. స్క్రీన్ పై కనిపించాలనుకునే ఆర్టిస్టులు, మోడల్స్, యాంకర్స్, సింగర్స్, ఇలా ఇతర నటీనుటులు.. టాలెంట్ ఉన్న కొత్తవారు.. ఇప్పటికే నటీనటులుగా మారిన వారు ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మూవీ మేకర్స్ నుంచి అవకాశాలు అందుకోవచ్చు. అంతేకాదు.. హైస్టార్ (HyStar) అనే వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో మెంబర్ షిప్ కోసం 200 రూపాయాలు చెల్సించాల్సి ఉంటుందట. కేవలం నటీనటులు.. కొత్తవారు మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీలో ఇప్పటికే రాణిస్తున్న మేకర్స్, డైరెక్టర్స్ కూడా ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా డైరెక్టర్స్ తమ సినిమాల్లోని పాత్రలకు నటీనటులను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఆర్టిస్టుల ప్రొఫైల్స్ బట్టి తమ సినిమా పాత్రలకు తగినవారా కాదా అని చూసుకొని..వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు.. ఇందులో ఎప్పటికప్పుడు అడిషన్స్ అప్డేట్ చేసుకోవచ్చు. సినీ పరిశ్రమలో.. టీవీ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురుచూసేవారికి ఈ హైస్టార్ యాప్ మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్