Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (kajal aggarwal ).. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చందమామగా గుర్తుండిపోయింది. దాదాపు స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (kajal aggarwal ).. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చందమామగా గుర్తుండిపోయింది. దాదాపు స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తన స్నేహితుడు.. ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య (Acharya) సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోపాటే.. అక్కినేని నాగార్జున నటిస్తోన్న ఘోస్ట్ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ప్రెగ్నెంట్ కావడంతో అనుహ్యాంగా సినిమాల్లో నుంచి తప్పుకుంది. గత కొద్ది రోజులుగా కాజల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫ్యామిలీతో సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరాకృతిలో మార్పులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీ సమయంలో ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్‌ను కూడా నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారట. తాజాగా తన శారీరాకృతిపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించింది కాజల్. తన ఇన్‌స్టా ఖాతాలో ఇదే విషయమై సుధీర్ఘ పోస్ట్ చేసింది కాజల్.
అందులో.. ” నా జీవితంలో.. నా శరీరంలో.. ఇంట్లో.. పని ప్రదేశంలో అనేక మార్పులు వచ్చాయి. వాటన్నింటినీ నేను ఎంజాయ్ చేస్తున్న.. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్స్, మీమ్స్ వలన నాకు ఏలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే.. కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి.. మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు. వారికి నేనొక విషయం చెప్పాలి. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్ది పొట్ట కూడా పెరుగుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. అలాగే ఇలాంటి సమయంలో తొందరగా అలసిపోతాం. ఈ సమయంలో మూడు, స్వింగ్ కూడా మారిపోతాయి. సమయాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అలాగే కొన్ని పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తలు అవసరం. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ సాధారణంగా మారడానికి చాలా సమయం పట్టవచ్చు. లేదంటే మునపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు. అయిన ఎక్కువగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలోకి మరో పాపాయి రాబోతున్న క్షణాలను ఎంజాయ్ చేయండి. ఎక్కువగా ఒత్తిడి పెంచుకోకండి.. ప్రతి క్షణంను ఎంజాయ్ చేయండి. ఇతరుల గురించి ఫీల్ కాకండి.. చిన్నారికి జన్ననివ్వడం అనేది ఒక పెద్ద వేడుక అని గుర్తుంచుకోండి ” అంటూ కాజల్ తెలిపింది.
View this post on Instagram
Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..
Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..