Kiara Advani: చరణ్ సినిమాకోసం హైదరాబాద్‌లో వాలిన అందాల సీతాకోకచిలుక

కియారా అద్వానీ.. ఈ అందం తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Kiara Advani: చరణ్ సినిమాకోసం హైదరాబాద్‌లో వాలిన అందాల సీతాకోకచిలుక
Kiara Advani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 13, 2022 | 7:30 AM

కియారా అద్వానీ(Kiara Advani).. ఈ అందం తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది కియారా. తొలి సినిమాతోనే ఇక్కడ కుర్రకారును కొల్లగొట్టేసింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో ఈ అమ్మడు తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన టాప్ హీరోయిన్ గా మారిపోయింది కియారా.

ఇక ఇప్పుడు మరోసారి మెగా పవర్ స్టార్ తో జతకడుతోంది ఈ చిన్నది. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. అలాగే ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట. ఐడియల్ ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లో వాలింది కియారా. చరణ్ – కియారా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ రోజు నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. కొన్ని సన్నివేశాలలో శ్రీకాంత్ .. సునీల్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వచ్చేఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి