AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: సౌత్ సినిమాలు చూసి అప్పుడు ఎగతాళి చేసేవారు.. కానీ అతని వల్ల మొత్తం మారిపోయిందంటున్న కేజీఎఫ్ స్టార్ ..

గతంలో సౌత్ సినిమాలను ఎగతాళి చేసేవారని.. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయని అన్నారు యష్..

Yash: సౌత్ సినిమాలు చూసి అప్పుడు ఎగతాళి చేసేవారు.. కానీ అతని వల్ల మొత్తం మారిపోయిందంటున్న కేజీఎఫ్ స్టార్ ..
Yash
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2022 | 10:48 AM

Share

కేజీఎఫ్ స్టార్ యష్‏కు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీతో యష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‏గా స్పెషల ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. రాకింగ్ స్టార్ నెక్ట్స్ మూవీతో ఎవరితో చేయనున్నాడు అంటూ ఇప్పటికే అభిమానులలో క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్‏క్లేవ్ ప్రోగ్రామ్‏లో పాల్గొన్న యష్.. తన తదుపరి సినిమాలు.. కేజీఎఫ్ 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు.. నార్త్, సౌత్ ఇండస్ట్రీ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.

గతంలో సౌత్ సినిమాలను ఎగతాళి చేసేవారని.. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయని అన్నారు. కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని… సౌత్ మూవీస్ హిందీ చిత్రాలతో పోటీపడాలంటే ఎంతో కష్టంగా భావించేవారని.. కానీ రాజమౌళి రూపొందించిన బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.

యష్ మాట్లాడుతూ.. “పది సంవత్సరాల క్రితమే ఉత్తరాదిన డబ్బింగ్ చిత్రాలు ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడడం స్టార్ట్ చేసారు. సౌత్ సినిమాలను ఇక్కడి వారు ఎగతాళి చేసేవారు. ఇదేం యాక్షన్.. అందరూ అలా ఎగిరిపోతున్నారు అంటూ నవ్వుకునేవారు. కానీ చివరకు వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది చిత్రాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ క్రెడిట్ జక్కన్నకే దక్కింది. బహుబలి సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసారు. ఇక ఆ తర్వాత ఆ చిత్రాన్ని భిన్నంగా కేజీఎఫ్ వచ్చింది. కేజీఎఫ్ సినిమా స్పూర్తి కలిగించింది. ప్రస్తుతం ప్రజలు సౌత్ సినిమాలను గమనించడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఇక్కడకు వచ్చిన మార్కెట్ చేయాలంటే వేరే బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం డిజిటల్ విప్లవంతో మనకు అవకాశం వచ్చింది. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ప్రజలు కేజీఎఫ్ 3 చిత్రం కోసం ఎదురుచూస్తున్నారని.. ప్రస్తుతం ఆ సినిమా గురించి ఓ ప్రణాళిక ఉందని.. త్వరలో మాత్రం కేజీఎఫ్ రాదని అన్నారు.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు