AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: రూమర్స్‌కు చెక్.. రామాయణం షూటింగ్‌లో అడుగుపెట్టిన యాష్..

రాకింగ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆతర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Yash: రూమర్స్‌కు చెక్.. రామాయణం షూటింగ్‌లో అడుగుపెట్టిన యాష్..
Yash
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2025 | 12:31 PM

Share

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో  భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ప్రారంభించారు. కాగా రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఆమధ్య ఈ సినిమా సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాదు ఈ సినిమా నిర్మాణంలోనూ యష్ భాగం అయ్యారు. రామాయణం సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

రణబీర్, సాయి పల్లవి ఇప్పటికే ముంబైలో తమ పాత్రలలోని కొన్ని భాగాలను చిత్రీకరించారు. ఇప్పుడు యష్ రామాయణం షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది.  రావణుడి పాత్ర పోషించడం కోసం ముంబైలో షూటింగ్ ప్రారంభించాడు యష్. రెండు రోజుల డ్రెస్ రిహార్సల్స్ తర్వాత, యష్ ఫిబ్రవరి 21, 2025న తన సన్నివేశాల షూటింగ్ ప్రారంభించాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ల్లో ఓ భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. అలాగే కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలను ముంబైలోని అక్సా బీచ్‌లో చిత్రీకరించారని టాక్. ఈ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత, రామాయణ బృందం తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం దహిసర్‌లోని ఒక స్టూడియోకు వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!

యుద్ధ సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు, రావణుడి వ్యూహాత్మక పరాక్రమాన్ని ప్రతిబింబించేలా యాక్షన్ కొరియోగ్రఫీని చేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుందని కూడా సమాచారం. సినిమాలోని ఈ సన్నివేశాల చిత్రీకరణలో యష్ తో పాటు ఇతర ప్రధాన నటులు కూడా చేరారని సినీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. రామాయణంలో లారా దత్తా, సన్నీ డియోల్, ఇందిరా కృష్ణ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

సోర్స్ Tv9 తమిళ్ (சாய் பால்லவியின் படத்தில் இணைந்த பிரபல நடிகர் யாஷ்….!)

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.