ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!
ఇప్పటివరకు కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో భారతీయుడు సినిమా ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కమల్ డ్యూయల్ రోల్ లో నటించారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు దాదాపు 22ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి వింటుంటారు కొందరు. ఇక ఈ సినిమాలో కమల్ తన నటవిశ్వరూపంతో మెప్పించారు. అవినీతి పై లంచగొండితనం పై పోరాడుతారు కమల్.
అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్. ఇక ఈ సినిమాలో ముసలి కమల్ హాసన్ కు భార్య నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? చాలా మందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు. కమల్ భార్యగా ఆమె అద్భుతంగా నటించింది. భారతీయుడు వన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి జనరేషన్స్ కు ఆ సినిమా ఓ మధురజ్ఞాపకం అని నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ భార్య పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు ఆమె పేరు సుకన్య. చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు సుకన్య. అమ్మ , వదిన పాత్రల్లో ఎక్కువగా కనిపించారు ఈ సీనియర్ నటి. తెలుగు, తమిళ్ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు సుకన్య. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లిగా కనిపించారు సుకన్య. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో సుకన్య పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ ఆమె ఫ్యాన్ పేజ్ ల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆమె అంతే అందంగా ఉన్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




