AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Yash: టాక్సిక్ సినిమాతో బిజీ.. రామాయణంలో యష్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య రామాయణం సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతరాముడిగా కనిపించనున్నారు. అలాగే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు రామాయణం సెట్ లో యష్ అడుగుపెట్టలేదు.

Actor Yash: టాక్సిక్ సినిమాతో బిజీ.. రామాయణంలో యష్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..
Actor Yash
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2025 | 8:27 PM

Share

రాకింగ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆతర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో యష్ కూడా నటిస్తాడని, ఈ సినిమా షూటింగ్ గురించిన సమాచారం.

‘రామాయణం’ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. నెగెటివ్ రోల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ఈ విషయం గోప్యంగా ఉండేది. తరువాత యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేశారు. రావణుడి పాత్రలో నటించేందుకు ఆసక్తితో ఉన్నానని తెలిపారు. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ లో యష్ ఎప్పుడు పాల్గొంటాడు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఫిలింఫేర్ రిపోర్ట్ ప్రకారం మార్చి నెలలో యష్ ‘రామాయణం’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. దీంతో రావణుడిగా యష్ లుక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకు ముందు ‘రామాయణం’ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా ఉండాలి. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్