AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Teaser: హిట్ 3 టీజర్.. నాని నుంచి ఇలాంటిది ఊహించలేదు.. మోస్ట్ వైలెంట్‌గా నేచురల్ స్టార్

నాని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్ 3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విష్వక్‌ సేన్‌తో ‘హిట్‌’, అడివి శేష్‌తో ‘హిట్‌ 2’ చిత్రాల్ని తెరకెక్కించిన శైలేశ్‌ మూడో భాగాన్ని నానితో రూపొందిస్తున్నారు.

HIT 3 Teaser: హిట్ 3 టీజర్.. నాని నుంచి ఇలాంటిది ఊహించలేదు.. మోస్ట్ వైలెంట్‌గా నేచురల్ స్టార్
Hit 3
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2025 | 12:05 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు.  2023లో హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. 2024లో సరిపోదా శనివారం మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని.. ఈసారి మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. గతంలో వచ్చిన హిట్ మీవీ సీక్వెల్ లో నటిస్తున్నాడు. హిట్ 3 అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా ఆ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా హిట్.. ది ఫస్ట్ కేస్ మూవీ ఘన విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత హిట్ 2 చిత్రంలో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈమూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడంతా హిట్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లోనే మూడో భాగానికి నాని హీరోగా ఉంటాడని అనౌన్స్ చేశారు మేకర్స్. అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నాడని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంనుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అంతే కాదు ఊహించని విధంగా ఉంది ఈ టీజర్.

ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. పోలీస్ కు తక్కువ, విలన్ కు ఎక్కువ అన్నట్లుగా అర్జున్ సర్కార్ పాత్రను చూపించారు. మునుపెన్నడూ చూడని విధంగా నాని ఈ సినిమాలో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. నాని రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది. ఈ టీజర్ కంప్లీట్ వైలెన్స్ తో నింపేశాడు దర్శకుడు.  డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.  ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై