Premi Vishwanath : కార్తీక దీపం సీరియల్ కు ఒక్క రోజుకు జీతం లక్ష రూపాయాలా.. ? ఎట్టకేలకు ఓపెన్ అయిన ప్రేమి విశ్వనాథ్..
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ సినీరంగాని చెందిన ఆమె.. ఇప్పుడు తెలుగులో విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం తర్వాత ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ తో మరోసారి అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పారితోషికం గురించి వస్తున్న వార్తలపై స్పందించింది.

ప్రేమి విశ్వనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. మలయాళంలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అప్పట్లో ఈ సీరియల్ దాదాపు 7 సంవత్సరాలు విజయవంతంగా దూసుకుపోయింది. ఇందులో దీప యాక్టింగ్… కార్తీక్ తో జోడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం కార్తీక దీపం 2లో దీప పాత్రలో మరోసారి అలరిస్తున్నారు ప్రేమీ విశ్వనాథ్. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా దీపక్క పారితోషికం గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. టీవీ ఇండస్ట్రీలోనే ఆమె అత్యధిక పారితోషికం తీసుకుంటుందని.. దాదాపు రోజుకు లక్ష ఇస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు వచ్చే రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నేను దాదాపు 10 ఏళ్లుగా తెలుగులో కార్తీక దీపం సీరియల్ చేస్తున్నాను. తెలుగులో దీప పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఆమె నల్ల అమ్మాయి. పదేళ్లపాటు ఒకే పాత్రను చేయగలగడం చాలా అరుదు. కేరళకు చెందిన నేను టాలీవుడ్ లో అంత మంచి ఆదరణ పొందడం చాలా కష్టం. అలాగే తెలుగులో రోజువారీ పారితోషికం లక్ష రూపాయలు అని విన్నాను. అది నిజమేనా అంటే అవును.. మీరు కూడా నాకు ఇవ్వచ్చు. తమిళ, తెలుగు భాషల్లో అభిమానం అపారంగా ఉంది. అక్కడి ప్రజలు చాలామంది ఆ పాత్రను ప్రేమిస్తారు, ఆరాధిస్తారు అని చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్..
ప్రేమీ విశ్వనాథ్.. ఆమె ప్రముఖ నటుడు జయసూర్యకు బంధువు. ఆమె లా పూర్తి చేశారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
