AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gagan Vihari: ఆ హీరో నన్ను ఆప్యాయతతో చేరదీశారు.. కానీ 39 ఏళ్లకే చనిపోవడం చాలా బాధేసింది: పుష్ప నటుడు

తెలుగు సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా రాణిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు గగన్ విహారి. ఆ మధ్యన ధర్మపురి సినిమాలో హీరోగానూ మెప్పించిన ఇతను పుష్ప, పుష్ప 2 సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలే రామ్ చరణ్ పెద్ది సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్

Gagan Vihari: ఆ హీరో నన్ను ఆప్యాయతతో చేరదీశారు.. కానీ 39 ఏళ్లకే చనిపోవడం చాలా బాధేసింది: పుష్ప నటుడు
Gagan Vihari
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 3:09 PM

Share

గగన్ విహారి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ పైన ఫొటో చూస్తే ఈ టాలీవుడ్ నటుడిని ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఇతని నటన అద్భుతంగా ఉంటుంది. కాగా చాలా ఏళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు గగన్. ఎక్కువగా నెగెటివ్ పాత్రలు చేస్తూ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా, అరవింద సమేత, పుష్ప, పుష్ప2 తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు గగన్. అలాగే 1996 ధర్మపురి అనే సినిమాలో హీరోగానూ మెప్పించాడు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తు బిజీ బిజీగా ఉంటోన్న ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ పుట్టిన రోజు నేడు (జూన్ 25). ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సహా పలువురు సినీ ప్రముఖులు గగన్ విహారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నందమూరి హీరోలైన ఎన్టీఆర్, తారకరత్నలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు గగన్ విహారి. జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పిన గగన్ తారకరత్నతో తనకు అనుబంధం ఎక్కువన్నారు. ‘నేను ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో నటించాను. ఆయన అద్భుతమైన నటుడు. ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్ ల చేసేస్తాడు. ఇక నేను  చాలా సార్లు తారకరత్న గారిని కలిశాను. మనుషులను ఆయన కలిపేసుకుంటారు. నన్ను తమ్ముడు అని పిలిచారు. నన్నే కాదు ఎవరినైనా ఆయన ఆప్యాయతతో దగ్గరకు తీసుకునేవారు. అలాంటిది ఆయన మరణ వార్త నన్ను చాలా బాధ పెట్టింది. తారకరత్న మరణానికి చాలా రోజుల ముందు కూడా నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను’ అని చెప్పుకొచ్చారు గగన్ విహారి. ఈ కామెంట్స్ పాతవే అయినా అతని పుట్టిన రోజు నేపథ్యంలో మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గగన్ విహారికి బర్త్ డే కేక్ తినిపిస్తోనన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us