ఆమెతో రొమాన్స్ నా వల్ల కాదు బాబోయ్.. స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్ చేయనన్న హీరో.. కారణం ఇదే..
సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల మధ్య సన్నిహిత సన్నీవేశాలు ఉండడం కామన్. ముఖ్యంగా పాటలు, పలు సన్నీవేశాల్లో లిప్ లాక్ సీన్స్ వస్తుంటాయి. కానీ ఓ హీరోయిన్ చేసిన పనికి దెబ్బకు రొమాంటిక్, లిప్ లాక్ సీన్ చేయనని మొండికేశాడు ఓ హీరో. ఆ హీరోయిన్ అప్పటికే పెద్ద స్టార్.. అయినప్పటికీ తనతో రొమాన్స్ చేయడం నావల్ల కాదంటూ వెళ్లిపోయాడట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో ఆ ఇద్దరూ స్టార్ హీరోహీరోయిన్స్. అయినప్పటికీ ఆమెతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఆ హీరో ఆసక్తి చూపించలేడు. అందుకు కారణం ఆమె నోటి నుంచి వచ్చిన దుర్వాసన. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో బయటపెట్టాడు. 1997లో విడుదలైన, రాజీవ్ రాయ్ దర్శకత్వం వహించిన విజయవంతమైన బాలీవుడ్ చిత్రం ‘గుప్త్: ది హిడెన్ ట్రూత్’. ఇందులో యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ హీరోగా నటించారు. అలాగే ఈ మూవీలో కాజోల్, మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రంలోని ఒక సన్నివేసంలో మనీషా కొయిరాలతో బాబీ డియోల్ లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సీన్ చేయడానికి బాబీ డియోల్ ఇష్టపడలేదట. దీని గురించి బాబీ డియోల్ మాట్లాడుతూ, “ఆప్ కి అదాలత్’ షూటింగ్ ప్రదేశం చల్లగా ఉండేది. అక్కడ ఎవరో చాట్ అమ్ముతున్నారు. మనీషా కొయిరాలా దాన్ని కొని రుచి చూసింది. ఒక పాట సన్నివేశంలో మనీషా కొయిరాలాతో నేను లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఆమె వద్ద ఉల్లిపాయ వాసన వచ్చింది. అందుకే ఆ సీన్ చేయనని చెప్పాను” అని అన్నారు బాబీ డియోల్.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
అలాగే.. “కాలేజీలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అందులో మనీషా సోదరుడు వచ్చి నన్ను కొట్టాల్సి ఉంది. అతను కొత్త నటుడు. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే బాగా నటించగలవని నేను అతనికి చెప్పాను. నేను అతని చేత చాలా ఉల్లిపాయలు తినిపించాను. ఆ సన్నివేశం వచ్చినప్పుడు, అతని నుండి ఉల్లిపాయ వాసన వచ్చింది. చిన్న వయసులో పరిణితి ఉండదు. అంతే” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘పర్సాద్’ చిత్రంలో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కుమార్తె ట్వింకిల్‌తో జరిగిన గొడవ గురించి బాబీ డియోల్ మాట్లాడుతూ.. ” నాకు చిన్నప్పటి నుంచి కడుపు సమస్యలు ఉన్నాయి. అందుకే నేను కడుపు సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడతాను” అని అన్నారు . నేను వాష్ రూంకు వెళ్లోస్తాను అన్నారు. ఆ మాట ట్వింకిల్‌కు నచ్చలేదు. ఈ విషయంలో, ప్రసాద్ గురించి ఆయన ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలోనే నా కడుపు సమస్య గురించి అందరికీ చెప్పేశారు. నేను వెంటనే ఆయనకు ఫోన్ చేసి, “మీరెలా అలా అనగలరు?” అని అడిగాను అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
అప్పట్లో సెట్‌లో అల్లరి పనులు చేయడం, హీరోయిన్లతో గొడవపడటం వంటి ఆరోపణలు బాబీ డియోల్‌పై వచ్చాయి. ఈ విషయంలో ట్వింకిల్ ఖన్నా వ్యవహారంపై మనీషా కొయిరాలా స్పష్టతనిచ్చారు. ఇదిలా ఉంటే.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న బాబీ డియోల్.. ఇటీవలే యానిమల్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
బాబీ డియోల్, మనీషా కొయిరాలా ఫోటో..

Bobby Deol, Heroine Manisha
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
