AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: రవి కటాక్షం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

Sun Transit in Gemini: మిథున రాశిలో రవి సంచారం జూలై 16 వరకు ఆరు రాశుల వారికి విశేష శుభఫలితాలు ఇవ్వనుంది. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారు ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఉద్యోగం, వ్యాపారం, సామాజిక గుర్తింపు వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.

Money Astrology: రవి కటాక్షం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 3:32 PM

Share

Telugu Astrology: గ్రహ సంచారంలో రవి కొన్ని కీలక స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు, తప్పకుండా శుభ ఫలితాలు మాత్రమే కలిగిస్తాడు. అధికారానికి, రాజకీయ ప్రాబల్యానికి, ప్రభుత్వాధికారులకు, తండ్రికి, ఐశ్వర్యానికి కారకుడైన రవి అనుకూలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడికి ఇక జీవితంలో తిరుగుండదు. ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న రవి.. జూలై 16 వరకు కొన్ని రాశులవారి పురోగతి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది.. మేషం, వృషభం, సింహం, కన్య, తుల, మకర రాశులకు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలిగించడంతో పాటు అందలాలు ఎక్కించడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఆదాయ వృద్ధికి, పదోన్నతికి ప్రయత్నాలు చేయడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఇతర దేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారమవుతుంది. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంచుకుని బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన రవి ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆస్తులు కలిసి రావడం, ఆస్తుల విలువ పెరగడం, ఆస్తులు కొనడం వంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి లాభస్థానంలో సంచారం చేయడం అత్యంత యోగదాయకమైన పరిణామం. మనసులోని కోరికలు చాలా భాగం నెరవేరుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల రాజయోగం కలిగింది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. అత్యున్నత పదవి పొందడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వోద్యోగాలకు ప్రయత్నించేవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
  7. మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరగడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు రికార్డులు సృష్టిస్తారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వాదోపవాదాల్లో విజయాలు లభిస్తాయి. పోటీదార్లు, ప్రత్యర్థులు, శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

Also Read: తొలగిన శని దోషం.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!

Follow Us