AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌కు మెంటలెక్కించిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైందీ సినిమా. కానీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనమే నమోదు చేసింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: థియేటర్లలో ఆడియెన్స్‌కు మెంటలెక్కించిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 2:38 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే అవతార్ 3, బ్రేక్ ఫాస్ట్ వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తుండగా గురువారం (జూన్ 25) నుంచి మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. పైగా అందులోనూ సీనియర్ హీరో, హీరోయిన్లు. దీంతో చాలా మంది ఆడియెన్స్ ఈ సినిమాను పిచ్చ లైట్ గా తీసుకున్నారు. అయితే ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సంచలనాలు సృష్టిస్తాయని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది. అయితే అంతలోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

అద్బుతమైన యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలో ఆడియెన్స్ కు మెంటలెక్కించిన ఈ సినిమా పేరు బ్లాస్. తెలుగులో బ్లాస్ట్ జోన్ గా రిలీజైంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే అయినా తన సూపర్బ్ టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సుభాష్. ఈ సినిమాలో చెప్పవే చిరుగాలి హీరోయిన్ అభిరామి, కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ కథానాయికలుగా చేశారు. జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న, అర్జున్ చిదంబరం, దిలీపన్, పవన్, వినోద్ సాగర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీకెండ్ లో ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి బ్లాస్ట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో అర్జున్, అభిరామిల బ్లాస్ట్..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us