Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో ‘పవిత్ర’ స్నానం.. దర్శన్ ప్రియురాలిపై నెటిజన్ల ట్రోలింగ్

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళాకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించింది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో 'పవిత్ర' స్నానం.. దర్శన్ ప్రియురాలిపై నెటిజన్ల ట్రోలింగ్
Pavithra Gowda
Follow us
Basha Shek

|

Updated on: Feb 01, 2025 | 8:45 AM

అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితురాలిగా ఉన్న హీరో హీరో దర్శన్ ప్రియురాలు, ప్రముఖ నటి పవిత్ర గౌడ ఆధ్యాత్మిక బాట పట్టింది. తాజాగా ఆమె ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో దర్శనమిచ్చింది. పవిత్రమైన మౌని అమవాస్య రోజు త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.’ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్‌ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను’ అని పోస్ట్ లో రాసుకొచ్చింది. దీనికి హరహర మహాధేవ్‌ అని క్యాప్షన్‌ జోడించింది. దీంతో కొద్ది క్షణాల్లోనే పవిత్ర గౌడ పోస్ట్, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు పవిత్ర గౌడను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒకరి కుటుంబాన్ని రోడ్డున పడేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటికి స్పందించిన పవిత్ర గౌడ మరో పోస్ట్ పెట్టింది.

‘మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియా సైట్స్‌కు చాలా పెద్ద థాంక్స్‌. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత క్షోభకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో పవిత్ర గౌడ.. వీడియో..

మీ కామెంట్స్ తో  మరింత క్షోభకు గురి చేస్తున్నారు

కాగా తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ రేణుకా స్వామిని పవిత్ర గౌడ, హీరో దర్శన్ గ్యాంగ్ తో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో వీరు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత హీరో దర్శన్ తో పాటు పవిత్ర గౌడ ఆలయాల బాట పట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పవిత్ర మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించింది. అయితే దర్శన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెను ఎప్పటిలాగే నెటిజన్లు  ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు