Rakshit Shetty: చెంతకు వచ్చి చేజారిపోతుంది.. రక్షిత్ శెట్టి జీవితంలో ప్రేమ కలిసి రావడం లేదా ?..
ఇటీవలే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రక్షిత్. ఈ సినిమాకు కన్నడలోనే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బీ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఈసినిమాను తెలుగులో నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు రక్షిత్.

కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో రక్షిత్ శెట్టి ఒకరు. 2010లో నామ్ ఏరియల్ ఒండ్ దిన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో సింపుల్ అగి ఓంద్ లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. మొన్నటివరకు తెలుగు ప్రేక్షకులకు రక్షిత్ అంతగా పరిచయం లేదు. కానీ అతను నటించిన 777 చార్లీ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగులోనూ అతడికి ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవలే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రక్షిత్. ఈ సినిమాకు కన్నడలోనే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బీ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఈసినిమాను తెలుగులో నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు రక్షిత్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా రక్షిత్ శెట్టి కాలేజీ ప్రేమకథకు సంబంధించిన కామెంట్స్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాలేజీలో రక్షిత్ శెట్టి ఓ అమ్మాయిని ప్రేమించాడట. రోజూ ఆ అమ్మాయి కాలేజీకి బస్సులో వెళ్లేదట. అదే బస్సులో తన స్నేహితుడు కూడా వచ్చేవాడని తెలిపాడు. అయితే చాలా రోజులుగా ఆ అమ్మాయిని ప్రేమించిన రక్షిత్.. ఓసారి ఆమెకు ప్రేమలేఖ రాశాడట. ఆ అమ్మాయికి నేరుగా ఇవ్వకుండా తన స్నేహితుడికి ఆ లెటర్ ఇచ్చి తనకు ఇవ్వమని చెప్పాడట. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ గానీ, రెస్పాన్స్ గానీ రాలేదట. ఆ తర్వాత రెండేళ్లకు అసలు విషయం తెలిసిందట. అసలు తన స్నేహితుడు ఆ లవ్ లెటర్ ను ఆ అమ్మాయికి ఇవ్వనేలేదని.. విచిత్రం ఏంటంటే.. వారిద్దరూ ఇప్పుడూ పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చాడు రక్షిత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Mithra Dhrohi 😳#sapthasagaraaludhaati #rakshithshetty #Telugu #kannada #twitter #trending #viral2023 #friends pic.twitter.com/xNb3oQhCOh
— Life.of.entertainment (@Lifeofentrtnmnt) November 13, 2023
ఇదిలా ఉంటే.. రక్షిత్ శెట్టి జీవితంలో ప్రేమ విఫలం కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాతో నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత ఏడాదికి వీరిద్దరి విడిపోయారు. 2017లో విడుదలైన కిరిక్ పార్టీ సినిమాలో రష్మిక మందన్నా, రక్షిత్ శెట్టి కలిసి నటించారు. ఈ మూవీతోనే రష్మిక కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు ఆ తర్వాత 2017లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఆ తర్వాతి ఏడాది 2018లో తమ ఎంగెజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







