Sai Dharam Tej: ఎందుకు బాబూ పెళ్లి చేసుకున్నావ్? సాయి ధరమ్ తేజ్ ప్రశ్నకు వరుణ్ ఆన్సర్ ఏంటో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీల వివాహం ముగిసి సుమారు రెండు వారాలవుతోంది. అయితే ఇప్పటికీ ఈ కొత్త జంటల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అభిమానులు, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఈ ఫొటోలకు ఒక సరదా క్యాప్షన్ ..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీల వివాహం ముగిసి సుమారు రెండు వారాలవుతోంది. అయితే ఇప్పటికీ ఈ కొత్త జంటల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అభిమానులు, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఈ ఫొటోలకు ఒక సరదా క్యాప్షన్ కూడా జోడించాడు తేజ్. పెళ్లిలో వరుణ్ తేజ్‌ను ఊరేగించే కారుపై తాను కాలు పెట్టిన ఫొటోను షేర్ చేసిన మెగా మేనల్లుడు.. ‘ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం’ అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి వరుణ్ తేజ్ కూడా స్పందించాడు. ‘అంతేగా.. అంతేగా’ అంటూ తన ‘ఎఫ్2’ సినిమాలోని ట్రేడ్ మార్క్ డైలాగును వాడేశాడు. ప్రస్తుతం తేజ్ పోస్ట్, వరుణ్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు, నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
కాగా పెళ్లి తర్వాత మొదటిగా వచ్చిన దీపావళి పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త దంపతులు వరుణ్- లావణ్య. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారీ న్యూ కపుల్. ప్రస్తుతం వరుణ్- లావణ్యల దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా సుమారు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటలీలోని టుస్కానీ వేదికగా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.
ఎందుకు బ్రో .. పెళ్లి చేసుకున్నావ్?
View this post on Instagram
వరుణ్- లావణ్యల పెళ్లిలో మెగా బ్రదర్స్..
View this post on Instagram
అమ్మతో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






