Martin Luther King OTT: అప్పుడే ఓటీటీలోకి సంపూర్ణేష్ ‘మార్టిన్ లూథర్ కింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట, బజార్ రౌడీ, క్యాలీ ఫ్లవర్, చోర్ బజార్ వంటి కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు. పేరడీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిదే కోవలో సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. తమిళంలో సంచలన విజయం సాధించిన 'మండేలా'కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది
హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట, బజార్ రౌడీ, క్యాలీ ఫ్లవర్, చోర్ బజార్ వంటి కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు సంపూర్ణేష్ బాబు. పేరడీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిదే కోవలో సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘మండేలా’కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తమిళంలో కమెడియన్ యోగిబాబు పోషించిన పాత్రలో తెలుగులో సంపూర్ణేష్ బాబు కనిపించాడు. పూజ కొల్లూరు తెరకెక్కించిన ఈ పొలిటికల్ సెటైరికల్ డ్రామా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైంది. అయితే తమిళంలో మాదిరిగా ఇక్కడ హిట్ కాలేకపోయింది. జనాలను పెద్దగా అలరించలేకపోయింది. అయితే సంపూర్ణేష్ మార్క్ కామెడీ మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. సోషల్ మీడియాలో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రీల్స్ నెటిజన్లును బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో నవ్వులు పంచిన మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సంపూర్ణేష్ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 17 నుంచి లేదా 24 నుంచి మార్టిన్ లూథర్ కింగ్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌తో పాటు వీకే నరేష్ డైరెక్టర్ వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ ప్రధాన పాత్రలు పోషించారు. YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయానా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. స్మరన్ సాయి ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో కనిపించాడు సంపూర్ణేష్. అతను ఉండే గ్రామలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలని పోటీ పడతారు. అయితే ఊరిలో అన్ని ఓట్లు సమానంగా అటు ఇటు సరిపోతాయి. దీంతో సంపూర్ణేష్ బాబు ఓటు కీలకంగా మారుతుంది. దీంతొ ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలంటే మార్టిన లూథర్ కింగ్ సినిమాను చూడాల్సిందే.
మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్
కింగు అంటే ఎవరంటే, కింగు అర్ధం ఏంటంటే… అద్దం ముందు నిలబడండి కనబడుతుంది. లేదంటే అక్టోబర్ 27 న థియేటర్లకు రండి, ఏకంగా మీలో జొరబడుతుంది.
ఈ కింగు గాథ వినువీధుల వరకు వినపడాలి, దండోరా వేద్దాం రండి..
Here is the much awaited Trailer of #MartinLutherKing !https://t.co/wRwLKH4wwe pic.twitter.com/zZL9U5PYdu
— Sampoornesh Babu (@sampoornesh) October 18, 2023
మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.