AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌పై సర్వే.. టాప్‌-5 లిస్టులో ఉండేది వీరే.. విన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 11 వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు కూడా బిగ్‌ బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా టాప్‌-5లో ఎవరెవరు ఉంటారో కూడా చెప్పుకొచ్చారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌పై సర్వే.. టాప్‌-5 లిస్టులో ఉండేది వీరే.. విన్నర్ ఎవరంటే?
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Nov 14, 2023 | 4:47 PM

Share

బిగ్ బాస్ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 11 వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు కూడా బిగ్‌ బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా టాప్‌-5లో ఎవరెవరు ఉంటారో కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. టాప్‌-5లో శివాజీ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, గౌతమ్‌ కృష్ణ నిలుస్తారని తెలుస్తోంది. దీపావళి రోజున కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌, టాలీవుడ్ సెలబ్రిటీల అభిప్రాయాల్లో కూడా ఎక్కువగా వీరి పేర్లే వినిపించాయి. బిగ్‌ బాస్‌ స్టేజ్‌ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ శివాజీని టాప్‌-5 లిస్టులో ఉంచారు. అతనికి మొత్తం 11 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కు 9 ఓట్లు పోలయ్యాయి. అలాగే ప్రిన్స్‌ యావర్‌కు 7 ఓట్లు, అమర్‌ దీప్‌ చౌదరికి 6 ఓట్లు, ప్రియాంక జైన్‌కు 6 ఓట్లు, గౌతమ్‌కు 5 ఓట్లు పడ్డాయి. అంటే అమ్మాయిల్లో ప్రియాంక జైన్‌ మాత్రం టాప్‌-5 లిస్టులో ఉండనుందని తెలుస్తోంది.

కాగా సినీ తారలపై నిత్యం సర్వేలు నిర్వహిస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై కూడా సర్వే నిర్వహించింది. ఈ సందర్బంగా నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో ఎప్పటిలాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ పేరు ఉంది. ఇక మూడో స్థానంలో అమర్‌ దీప్‌ చౌదరి కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ పేరు ఉండగా.. ఐదో స్థానంలో మోనిత శోభాశెట్టి ఉంది. మొత్తానికి ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌజ్‌లో శివాజీ ఆధిపత్యమే నడుస్తోంది. దీంతో అతనే ఏడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలుస్తాడని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్మాక్స్ మీడియా సర్వేలో తేలిందిదే..

View this post on Instagram

A post shared by Ormax Media (@ormaxmedia)

హిందీ బిగ్ బాస్ పై కూడా సర్వే..

View this post on Instagram

A post shared by Ormax Media (@ormaxmedia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం..
మహిళా కలెక్టర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం..
 ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!
 ఉదయం 5 గంటలకే లేవాలా? 5 AM రొటీన్‌లోని అసలు విషయం ఇదే!
కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు.. ఏ గదికి ఏ రంగు సరిపోతుందో తెలుసా?
కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు.. ఏ గదికి ఏ రంగు సరిపోతుందో తెలుసా?
నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే..
నోరూరించే కొబ్బరి పాల అన్నం.. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే..
మిగిలిన అన్నంతో మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు.. ఇలా చేయండి!
మిగిలిన అన్నంతో మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు.. ఇలా చేయండి!
  పాత ప్లాస్టిక్ కవర్లతో ఇన్ని పనులా? డబ్బు ఆదా చేసే చిట్కా
  పాత ప్లాస్టిక్ కవర్లతో ఇన్ని పనులా? డబ్బు ఆదా చేసే చిట్కా
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం..
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? పాపం 34 ఏళ్లకే హఠాన్మరణం..
రిచ్‌ లుక్‌, తక్కువ ధరతో మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇయర్‌బడ్స్‌
రిచ్‌ లుక్‌, తక్కువ ధరతో మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇయర్‌బడ్స్‌
  ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారా? ఈ చిన్న అలవాటు తగ్గించేస్తుంది
  ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారా? ఈ చిన్న అలవాటు తగ్గించేస్తుంది
బ్లాక్ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికేటప్పుడు ఇలా చేయొద్దు
బ్లాక్ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికేటప్పుడు ఇలా చేయొద్దు