Vikram: ఓటీటీలోనూ సత్తా చాటుతోన్న కమల్ హాసన్.. ‘విక్రమ్’ ఖాతాలో నయా రికార్డ్
చాలా రోజులతర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తన విశ్వరూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
చాలా రోజులతర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తన విశ్వరూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటించిన విక్రమ్(Vikram)సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కమల్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. విక్రమ్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలై భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా చివరి నిమిషంలో సూర్య వచ్చిన సీన్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందంటూ కామెంట్స్ చేశారు అభిమానులు.ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది ఈ మూవీ. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా విక్రమ్ సినిమా ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించి.. ఓటీటీలో రికార్డ్ సృష్టించింది విక్రమ్. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాటలాడుతూ.. ‘విక్రమ్’ సినిమా రూపంలోప్రేక్షకులు అందించిన అపూర్వ విజయం మాకెంతో సంతోషాన్నిచ్చింది అన్నాడు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ ఈ సినిమా చేరింది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లోనూ హయ్యెస్ట్ వీకెండ్ వ్యూయర్ షిప్ సాధించడం ఆనందంగా ఉంది. మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ అని అన్నారు. విక్రమ్ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ కన్నడ మలయాళ ఆప్షన్స్ కూడా ఇచ్చారు.