Charu Haasan: మళ్లీ ఆస్పత్రి పాలైన కమల్‌ హాసన్‌ సోదరుడు.. వీడియో షేర్ చేసిన నటి సుహాసిని

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ సోదరుడు, సీనియర్‌ నటుడు, దర్శకుడు, చారుహాసన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ప్రముఖ సినీ నటి సుహాసిని మణిరత్నం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Charu Haasan: మళ్లీ ఆస్పత్రి పాలైన కమల్‌ హాసన్‌ సోదరుడు.. వీడియో షేర్ చేసిన నటి సుహాసిని
Charuhasan
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 4:17 PM

ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్ మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఇటీవల తన ఇంటి డాబాపై పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీపావళికి ముందు రోజు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చారు హాసన్ ను ఆస్పత్రిలో చేర్చారు. సినీనటి సుహాసిని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న తన తండ్రితో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్చేసింది. అలాగే ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది సుహాసిని. ‘ దీపావళికి ముందు రోజు నాన్న అస్వస్థతకు గురయ్యారు. ఇక పండగ రోజే ఆయన ఎమర్జెన్సీ వార్డులో గడిపారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి బాగా ఉంది. సర్జరీకి సిద్ధమవుతున్నారు’ అని సుహాసిని చెప్పుకొచ్చింది. ఇక ఇదే వీడియోలో చారు హాసన్ మాట్లాడుతూ.. ‘నేను బాగున్నాను. సర్జరీకి సిద్ధంగా ఉన్నా. మళ్లీ మిమ్మల్ని చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చారు హాసన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

చారు హాసన్ ప్రస్తుత వయసు 93 ఏళ్లు. దీంతో గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అప్పుడు త్వరగానే కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో చారు హాసన్.. పక్కన కూతురు సుహాసిని..

కాగా చారుహాసన్‌ తమిళంతోపాటు పలు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కించారు. ఇక చారు హాసన్ చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన ‘హర’ అనే తమిళ చిత్రంలో కనిపించారు. అలాగే తెలుగులో పాప్ కార్న్ అనే సినిమాలో ఆఖరి సారిగా కనిపించారు. ఈ సినిమా షూటింగుల  తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.

గతంలోనూ..

సుహాసిని తల్లిదండ్రులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.