AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది.. ఈ కశ్మీరీ అందాన్ని గుర్తుపట్టండి..

సోషల్ మీడియాలో అలనాటి హీరోయిన్ టీనేజ్ ఫోటో తెగ ఆకర్షిస్తోంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. ఆ తర్వాత వయసుకు తగినట్లుగా అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో చాలా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది.. ఈ కశ్మీరీ అందాన్ని గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2024 | 4:24 PM

Share

పైన ఫోటోను చూశారు కదా.. అందులో కాశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ అమ్మాయి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అప్పట్లో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా 80, 90’sలో ఆమె బిజీ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికీ సినిమాల్లో చాలా చురుకుగా ఉంది. మరోవైపు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ? తనే సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్.

రాధిక శరత్ కుమార్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ సినీనటుడు, హాస్యనటుడు ఎంఆర్ రాధ కుమార్తె. పైన కనిపిస్తున్న ఆమె ఆమె నటించిన శ్రీలంక గీతా చిత్రంలోనిది. 1978లో డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన ఇష్కిష్కే పోమియా రైల్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన రాధిక.. ఆ తర్వాత వరసు అవకాశాలు అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రాధిక హిట్ పెయిర్. అలాగే కమల్ హాసన్, రాధిక కలిసి నటించిన స్వాతిముత్యం సినిమా ఇప్పుటికీ క్లాసికల్ సూపర్ హిట్.

రాధిక తన తోటి నటుడు, శరత్ కుమార్ ను 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహుల్,ర్యానే హార్డీ అనే పిల్లలు ఉన్నారు. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రాడాన్ మీడియా వర్క్ ఇండియ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. అలాగే ఇప్పటివరకు జాతీయ అవార్డు, ఆరు ఫిల్మ్ పేర్ అవార్డ్స్,రెండు నంది అవార్డ్స్, తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర చలనచిత్ర అవార్డును మూడు సార్లు గెలుచుకుంది. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ ఏడాది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..
'సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ..సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా?
'సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ..సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా?