AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surekha Vani : రెండో పెళ్లిపై కుండబద్దలు కొట్టిన సురేఖా వాణి.. ఓపెన్‌గా చెప్పేశారు

రెండో పెళ్లి వదంతులపై నటి సురేఖ వాణి స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టేశారు. సోషల్ మీడియాపై తనకున్న అభిప్రాయాన్ని, సుప్రీత సినీ ప్రవేశం, ప్రాజెక్టుల ఎంపికపై ఆమె పాత్రను వివరించారు. సినిమాలకు, టీవీకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ..

Surekha Vani : రెండో పెళ్లిపై కుండబద్దలు కొట్టిన సురేఖా వాణి.. ఓపెన్‌గా చెప్పేశారు
Surekha Vani
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2026 | 8:12 PM

Share

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సురేఖ వాణి, ఇటీవల తన రెండో పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైనప్పుడు, “ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదు అనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసొచ్చిందండి.. నేనేం పెళ్లి చేసుకుంటానండి?” అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. తన పెళ్లిని మీడియా వర్గాలు చాలా ఏళ్ల క్రితమే చేసేసాయని, రాసేసాయని సరదాగా వ్యాఖ్యానించారు. సురేఖ వాణి తన కెరీర్, కూతురు సుప్రీత, సోషల్ మీడియాలో తన యాక్టివ్ రోల్‌ గురించి కూడా మాట్లాడారు. చాలా కాలం తర్వాత మంచి పాత్రలతో వస్తున్నారని, తన వాయిస్, కామిక్ టైమింగ్ సినిమాలను బాగా ఎలివేట్ చేస్తాయని నిరమ్ మూవీ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుందని రిపోర్టర్ అన్నప్పుడు, తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను అడగాలని సురేఖ వాణి కోరారు. తను సినిమాలకు దూరం కాలేదని, అవకాశాలు వస్తే ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తాను టీవీ నుంచి వచ్చానని, చిన్న స్క్రీన్, పెద్ద స్క్రీన్ అనే తేడా లేకుండా తాను ఎప్పుడూ నటనకు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.

సోషల్ మీడియాపై తన దృక్పథాన్ని సురేఖ వాణి వివరించారు. “ఇట్స్ ఏ ప్లాట్‌ఫామ్” అని చెబుతూ, అక్కడ వచ్చే రియాక్షన్‌ల గురించి మొదట్లో పట్టించుకునేవారమని, తర్వాత పట్టించుకోవడం మానేశామని అన్నారు. ఈ చుట్టుపక్కల ఉండేది నాకు అనవసరం. నాకు నేనేం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాను, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా. నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్. అంతే” అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇతరులు ఏమనుకుంటున్నారని ఆలోచించడం కష్టమని ఆమె అన్నారు.

సుప్రీతకు వచ్చే స్టోరీలను తాను కూడా వింటానని, అయితే డెసిషన్ మేకింగ్ మాత్రం తన కుమార్తెదేనని సురేఖ వాణి తెలిపారు. కొన్నింటిని వద్దని తాను చెబుతానని, కొన్నింటికి “ఇది నీ డెసిషన్, నీకు ఓకేనా?” అని అడుగుతానని చెప్పారు. సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, దానికి కారణం ఆమె ఉడుకు రక్తం కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా ఉంటుందని సురేఖ వాణి వివరించారు. భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించగా, సుప్రీత చేసిన మొదటి మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదని, అయితే ఆ మూవీలో తాను కూడా ఒక పాత్ర చేశానని, అది కూడా సుప్రీత కాంబినేషన్‌లోనే ఒక డాక్టర్ క్యారెక్టర్ అని వెల్లడించారు. తాను ఎప్పుడూ ఒక ఆర్టిస్ట్‌గా టీవీ, సినిమా అనే తేడా లేకుండా అవకాశాల కోసం సిద్ధంగా ఉంటానని, లభించే అవకాశాలను బట్టి పనిచేస్తానని సురేఖ వాణి స్పష్టం చేశారు.

Follow Us