AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేక్ కలెక్షన్స్.. కుండ బద్ధలు కొట్టిన నిర్మాతలు..!

ఫేక్ కలెక్షన్స్.. కుండ బద్ధలు కొట్టిన నిర్మాతలు..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 8:17 PM

Share

టాలీవుడ్‌లో ఫేక్‌ కలెక్షన్స్‌ వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. సినిమాల పోస్టర్లపై కనిపించే వందల కోట్ల నంబర్లు నిజమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా ఫేక్‌ కలెక్షన్స్‌ ఇండస్ట్రీకి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు నవీన్‌ యేర్నేని, నాగవంశీ, దిల్‌ రాజు వంటి నిర్మాతలు ఫ్యాన్స్‌, మార్కెటింగ్‌ అవసరాల కోసం కలెక్షన్‌ నంబర్లను పెంచి చూపించే పరిస్థితులు ఉన్నాయని చెప్పినట్లు కథనం పేర్కొంది. దీనిపై టాలీవుడ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్‌లో ఇప్పుడెక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గురించే చర్చ జరుగుతోంది. అసలు పోస్టర్ల మీద వేస్తున్న వందల కోట్ల నంబర్లలో నిజమెంత..? కేవలం హీరోల ఫ్యాన్స్‌ను ఖుషీ చేసి సోషల్ మీడియాలో హైప్ పెంచడానికే నిర్మాతలు ఇలా ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారా..? కొందరు నిర్మాతలు దీన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ అంటుంటే మరికొందరు మాత్రం ఇది ఇండస్ట్రీకి నష్టమని ఎందుకు భయపడుతున్నారు..? ఈ మధ్యే రోమాంచకం సక్సెస్ మీట్‌లో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌‌తో టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్స్ మీద మరోసారి చర్చ మొదలైంది. ఫేక్ చూపించి క్రేజ్ పెంచుకోవడం ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా మంది ఓవర్ చేసి చెప్తుంటారు కానీ అది అవసరం లేదు.. కంటెంట్ బాగుంటే సినిమానే మాట్లాడుతుందన్నారు ప్రణయ్. ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్‌పై మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని కూడా స్పందిస్తూ.. ఆరోజు ఉన్న పరిస్థితుల డిమాండ్ బట్టే అలా ఫేక్ నంబర్స్ వేయాల్సి వస్తుందని ఇరుముడి సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. పోస్టర్స్ మీద కనిపించే కలెక్షన్స్ పక్కా ఫేక్ అని నిర్మాత నాగవంశీ ఓపెన్‌గానే ఒప్పేసుకున్నారు.. కేవలం ఫ్యాన్స్ కోసం, మార్కెటింగ్ క్రేజ్ కోసమే ఆ నంబర్స్ వేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. అసలైన బాక్సాఫీస్ నంబర్స్ కేవలం నిర్మాతకు మాత్రమే తెలుస్తాయని, హీరోలను ఇంప్రెస్ చేయడానికి, ఫ్యాన్ వార్స్ కోసమే ఫేక్ వేయాల్సి వస్తుందని నాగవంశీతో పాటు దిల్ రాజు కూడా చెప్పారు. కాకపోతే ఫేక్ వేసి రేంజ్ పెంచడం వల్ల హీరోలు, డైరెక్టర్ల మార్కెట్ వాల్యూ దారుణంగా పడిపోతుందని ప్రణయ్ రెడ్డి హెచ్చరించారు. ప్రేక్షకులను మభ్యపెట్టడం మానేసి రియల్ నెంబర్స్ వేయాలన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

Follow Us