పదో తరగతి చదువుతున్న బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై ఫిర్యాదు నమోదైంది. ఈఎంఐ బకాయిల కారణంగా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి చర్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.