తెలంగాణలోని ఏటూరునాగారం అడవుల్లో అత్యంత విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము కనిపించింది. పసుపు-నలుపు చారలతో వింతగా కనిపించిన ఈ అరుదైన పామును చంపవద్దని, అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది భారతదేశంలో అరుదుగా కనిపించే జాతి కావడంతో దాని రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో వరంగల్లోనూ ఇదే పాము కనిపించింది.