రూ.100 కోట్ల లాభాలు.. కలలోనైనా విన్నారా ఈ మాట…!
తెలుగు సినిమాల్లో రూ.100 కోట్లకు పైగా బయ్యర్లకు లాభాలు తెచ్చిన చిత్రాలు అరుదు. ఈ జాబితాలో రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ‘బాహుబలి 2’ ఏకంగా రూ.508 కోట్లకు పైగా లాభాలతో అత్యంత లాభదాయక చిత్రంగా నిలిచిందని కథనం పేర్కొంది. మొత్తం 8 సినిమాలు ఈ ఫీట్ సాధించినట్లు తెలిపింది.
మీడియం రేంజ్ హీరోలు 100 కోట్లు షేర్ వసూలు చేయడమే అద్భుతం అనుకుంటే.. 100 కోట్లకు పైగా లాభాలే తెచ్చి చూపించారు. ఇక స్టార్ హీరోల్లో కూడా ఈ ఫీట్ అందుకున్న సినిమాలున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఒకరే మూడుసార్లు 100 కోట్లకు మించి లాభాలు అందించారు.. బన్నీ, ప్రభాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరి ఆ సినిమాలపై కూడా ఓ లుక్కేద్దామా..? తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల షేర్ మొదటిసారి అందుకున్న సినిమా బాహుబలి.. అలాగే 100 కోట్ల ప్రాఫిట్స్ చూపించిన సినిమా కూడా ఇదే. 2015లో విడుదలైన ఈ చిత్రం.. 118 కోట్ల లక్ష్యంతో వచ్చి.. 304 కోట్లు షేర్ వసూలు చేసి.. చివరగా బయ్యర్లకు 186 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక బాహుబలి 2 ఏకంగా 508 కోట్ల లాభాలతో ఇండియాలోనే నెంబర్ వన్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. బాహుబలి 2 సినిమాకు 350 కోట్ల బిజినెస్ చేస్తే.. ఫైనల్ రన్‌లో 858 కోట్లు వసూలు చేసి 508 కోట్లకు పైగా లాభాలు తెచ్చింది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా 450 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి.. ఫుల్ రన్‌లో 615 కోట్లు షేర్ వసూలు చేసి 161 కోట్లు లాభాలు తెచ్చింది. జరిగిన బిజినెస్‌కు తగ్గట్లుగానే తన సినిమాలకు లాభాలు కూడా తెచ్చిపెట్టారు దర్శక ధీరుడు. పుష్ప 2 కూడా ఈ లిస్టులో ఉంది. 617 కోట్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుష్ప 2.. ఏకంగా 840 కోట్లు షేర్ వసూలు చేసి 220 కోట్లకు పైగా బయ్యర్లకు లాభాలు తెచ్చింది. అలాగే కల్కి సినిమాతో ప్రభాస్ సైతం 370 కోట్ల బిజినెస్ చేస్తే.. ఫుల్ రన్‌లో 540 కోట్లు షేర్ వసూలు చేసి.. ఫైనల్‌గా బయ్యర్లకు 168 కోట్లు లాభాలు తెచ్చింది. ఇలా 8 సినిమాలు మాత్రమే థియేటర్లలో 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చాయి. 118 కోట్ల లక్ష్యంతో వచ్చి.. 304 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి. బయ్యర్లకు 186 కోట్లకు పైగా లాభాలు, బాహుబలి 2 సినిమాకు 350 కోట్ల బిజినెస్ ఫైనల్ రన్‌లో 858 కోట్లు షేర్.. 508 కోట్లకు పైగా లాభాలు, ట్రిపుల్ ఆర్ సినిమాకు 450 కోట్ల టార్గెట్ ఫుల్ రన్‌లో 615 కోట్లు షేర్.. 161 కోట్లు లాభాలు, 617 కోట్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుష్ప 2 840 కోట్లు షేర్ వసూలు చేసి.. 220 కోట్లకు పైగా బయ్యర్లకు లాభాలు, కల్కి 370 కోట్ల బిజినెస్ చేస్తే.. ఫుల్ రన్‌లో 540 కోట్లు షేర్.. ఫైనల్‌గా బయ్యర్లకు 168 కోట్లు లాభాలు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

