16ఏళ్లకే ఫేక్ వీడియోలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ 

10 September  2026

Rajeev 

Pic credit - Instagram

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడిన విషయం తెలిసిందే.

స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరుకు చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.

చిన్న వయసులోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఆమె.. కానీ కొంతమంది ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారు.

 ఆమె మరెవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి.. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతున్న అనిఖా సురేంద్రన్.

ఈ చిన్నది అజిత్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్లకే వీడియోలు, ఫోటోలు లీక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవి ఫేక్ అని తేలిపోయింది.

ఇక 18 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.