AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC Movie: ‘డీసీ’కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా 'డీసీ'. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత హీరో, మ్యూజిక్ డైరెక్టర్ లకు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు.

DC Movie: 'డీసీ'కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో
DC Movie
Basha Shek
|

Updated on: Sep 10, 2026 | 10:26 PM

Share

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా డీసీ సినిమాకు అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ క్రమంలో ‘డిసీ’ బ్లాక్‌బస్టర్‌ విజయంతో నిర్మాత కళానిధి మారన్‌ చాలా సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌లను అభినందించారు. అంతేకాదు వీరికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ మేరకు కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇక డీసీ సినిమా విషయానికి వస్తే ఇదొక రా అండ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్.. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లు గా నటించారు. అలాగే తలైవాసల్ విజయ్, అవినాష్ రఘు దేవన్, కస్తూరి రాజా, బాలాజీ దేవీ ప్రసాద్, శ్రీకృష్ణ దయాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా థియేటర్లలో సంచలన విజయం సాధించిన డీసీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. సెప్టెంబర్ 04 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు