Karthi: ఏడేళ్ల క్రితం ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ఇలా.. హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన సర్దార్ 2 సినిమా ఇవాళ (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో కార్తీ ఒక అమ్మయిని కలిశాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా అతని సినిమాలు తెలుగులోనూ రిలీజవుతుంటాయి. తాజాగా సర్దార్ 2 సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు కార్తీ. నాలుగేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన డైరెక్టర్ పీఎస్ మిత్రనే సర్దార్ 2 సినిమాకు దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఎస్ జే సూర్య, రజిషా విజయన్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. కాగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు హీరో కార్తీ. ముఖ్యంగా ప్రమోషన్లలోనూ విస్తృతంగా పాల్గొన్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ మీట్ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉంటే సర్దార్ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో కార్తీ ఒక అమ్మాయిని కలిశాడు. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న అమ్మాయి హీరో కార్తీతో ఎంతో సరదాగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా? అని ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సుమారు ఏడేళ్ల క్రితం కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖైదీ’. అందులో కార్తీ కూతురు ఆముద పాత్రలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్బుతంగా నటించింది. మరి ఈ బాల నటి ఏమైపోయిందనుకుంటున్నారా? ఆమె ఎక్కడికి పోలేదు. పై ఫొటోలో ఉన్నది తనే. పేరు మోనికా శివ. ఖైదీతో పాటు పెట్రోమ్యాక్స్, ఇరుంబు, రాటసన్, విక్రమ్.. ఇలా చాలా సినిమాల్లో నటించింది మోనికా శి. కాగా ఖైదీ సినిమాలో నటించే సమయానికి మోనిక వయసు 11 ఏళ్లు. ఖైదీ చిత్రం విడుదలై ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడేళ్లలో ఆ పాప పెరిగి పెద్దది అయ్యింది. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. తాజాగా ఓ ఈవెంట్లో కార్తీ గెస్ట్ గా రాగా అక్కడికి మోనికా కూడా వచ్చి కార్తీని ఆశ్చర్యపరిచింది. సుమారు ఏడేళ్ల తర్వాత ఢిల్లీ – అముద కలిసి కనిపించడంతో సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆ చిన్న పాప అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. వీటిని చూసిన నెటిజన్లు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఖైదీ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడిలా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




